తితిదే ఛైర్మన్ పదవి నాకా? మోహన్ బాబు

బుధవారం, 5 జూన్ 2019 (13:06 IST)
ఎన్నికలకు ముందు తాను పదవుల కోసం వైకాపాలో చేరలేదని సినీ నటుడు మోహన్ బాబు వివరణ ఇచ్చారు. తిరుమల తిరుపతి దేవస్థానం (తితిదే) పాలక మండలి ఛైర్మన్‌గా మోహన్ బాబును నవ్యాంధ్ర ముఖ్యమంత్రి జగన్ నియమించనున్నారనే వార్తలు మీడియాలో వస్తున్నాయి. వీటిపై మోహన్ బాబు వివరణ ఇచ్చారు. 
 
తాను తితిదే ఛైర్మన్ రేసులో ఉన్నట్టు వస్తున్న వార్తల్లో ఎలాంటి నిజం లేదని స్పష్టం చేశారు. తాను జగన్‌ను నవ్యాంధ్ర ముఖ్యమంత్రిగా చూడాలని అనుకున్నాను. అందుకోసం తన వంతు కృషి చేశాను. ప్రజల ముఖ్యమంత్రిగా జగన్ ఉంటారనే నమ్మి తాను రాజకీయాల్లోకి వచ్చాను. అందుకే ఆ పార్టీలో చేరాను. అంతేకానీ, తాను ఏ పదవులు ఆశించలేదని, దీనిపై మీడియాలో వస్తున్న వదంతులను ఆపాలని ఆయన కోరారు. 
 
కాగా, వైఎస్. జగన్ మోహన్ రెడ్డికి మోహన్ బాబు బంధువు కూడా అవుతారు. ఆయన కుమారుడు విష్ణు వివాహం చేసుకుంది జగన్ బంధువునే కావడం గమనార్హం. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు