తిరుమల - అలిపిరి నడక దారిలో చిరుతపులి, ఎలుగుబంట్లు సంచారం కనిపించింది. వీటి సంచారం సీసీటీవీ కెమెరాల్లో కనిపించాయి. ఇటీవల అలిపిరి నడక మార్గంలో వెళుతున్న శ్రీవారి భక్తుల్లో ఓ బాలికపై చిరుతపులి దాడి చేసి చంపేసిన విషయం తెల్సిందే. ఆ తర్వాత నడక మార్గం భక్తులపై తితిదే అధికారులు పలు రకాలైన ఆంక్షలు విధించారు. మధ్యాహ్నం 2 గంటల తర్వాత చిన్నపిల్లలను నడక మార్గంలో అనుమతించడం లేదు. అలాగే, నడక మార్గంలో వెళ్లే భక్తులకు రక్షణగా చేతి కర్రలను కూడా ఇస్తుంది.
ఈ నేపథ్యంలో ఈ మార్గంలో తితిదే అధికారులు ట్రాప్ కెమెరాలను ఏర్పాటు చేశారు. ఈ కెమెరాల్లో ఈ వీటి సంచారం కనిపించింది. శని, ఆదివారాల్లో సంచరిస్తూ కెమెరాలకు చిక్కిన రెండు చిరుతలు, ఎలుగుబంట్లు కనిపించాయి. నడక మార్గంలోని ఏడో మైలురాయి వద్ద ఏర్పాటు చేసిన కెమెరాల్లో శుక్ర, శనివారాల్లో ఓ ఎలుగుబంటి, రెండు చిరుతలు సంచరిస్తూ కనిపించాయి. అలాగే, ఆదివారం సాయంత్రం లక్ష్మీనరసింహ స్వామి ఆలయానికి సమీపంలో ఓ ఎలుగుబంటి సంచరించింది. దీంతో అప్రమత్తమైన తితిదే అధికారులు నడకదారి భక్తులు ఇబ్బంది పడకుండా తగిన చర్యలు చేపట్టారు.
బ్యాంకు మేనేజరు బలవన్మరణం.. ఎందుకు?
తెలంగాణ రాష్ట్రంలోని కొమ్రం భీం జిల్లా వాకిండిలో విషాదకర ఘటన చోటుచేసుకుంది. ఒక బ్యాంకు మేనేజర్ ఆత్మహత్య చేసుకున్నాడు. పని ఒత్తిడి భరించలేక ఆయన బలవన్మరణానికి పాల్పడ్డాడు. దీంతో ఆయన భార్య, కుమారుడు అనాథలయ్యారు. తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే,
దీన్ని గమనించిన బ్యాంకు సిబ్బంది ఏమైందని అడిగితే ఒంట్లో బాగాలేదని సమాధానమిచ్చారు. సిబ్బంది వెంటనే ఆసిఫాబాద్‌లో ఉంటున్న భార్య, కుటుంబ సభ్యులకు సమాచారం ఇచ్చి ఆసిఫాబాద్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అక్కడి వైద్యులు ప్రథమ చికిత్సలు చేసి మెరుగైన వైద్యం కోసం మంచిర్యాల ఆసుపత్రికి తీసుకెళ్లాలని సూచించారు.
దీంతో కుటుంబ సభ్యులు మంచిర్యాలకు తరలించగా.. పరిస్థితి విషమంగా ఉండటంతో అక్కడి నుంచి కరీంనగర్‌లోని ఓ ప్రైవేటు ఆసుపత్రికి తీసుకెళ్లారు. అక్కడ చికిత్స పొందుతూ ఆదివారం మధ్యాహ్నం మృతిచెందారు. బ్యాంకులో పనిభారం ఎక్కువైందని భార్య ప్రియాంకతో చెబుతుండే వాడని, ఒత్తిడితోనే మనస్తాపానికి గురై ఆత్మహత్యకు పాల్పడి ఉంటాడని తండ్రి లక్ష్మీరాజం పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొన్నారు.