ఇటీవలికాలంలో తిరుమల తిరుపతి కనుమ రహదారుల్లో చిరుత పులి దాడి ఘటనలు ఎక్కువ అవుతున్నాయి. తాజాగా ఇద్దరు ద్విచక్రవాహనదారులపై చిరుతపులి దాడిచేసింది. ఇది స్థానికంగా కలకలం రేపింది. ఈ చిరుత దాడిలో గాయపడిన వారిలో ఎఫ్ఎంఎస్ సిబ్బంది ఆనంద్, రామకృష్ణలు ఉన్నారు.
కాగా, ఇటీవలి కాలంలో శేషాచలం అటవీ ప్రాంతాల్లో చిరుతపులల సంసారం ఎక్కువైందిని భక్తులు ఎప్పటి నుంచో చెబుతున్నారు. దీంతో తిరుమల అధికారులతో పాటు అటవీశాఖ అధికారులు కూడా అప్రమత్తమై భక్తులన జాగ్రత్తగా ఉండాలంటూ పదేపదే హెచ్చరికలు చేస్తున్నారు. ఈ నేపథ్యంలో తాజాగా చిరుతపులి దాడి కలకలం రేపింది. ఈ దాడిలో గాయపడిన వారిద్దరినీ విజిలెన్స్ అంబులెన్స్‌లో ఆశ్విని ఆస్పత్రికి తరలించి చికిత్స అందించారు.