ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని తిరుమలలో సప్తగిరి గ్రామీణ బ్యాంక్ నూతన శాఖను ఇండియన్ బ్యాంక్ మేనేజింగ్ డైరెక్టర్ అండ్ సీఈవో శ్రీ శాంతి లాల్ జైన్ డిసెంబర్ 10, 2021న ప్రారంభించారు. బ్యాంకుకు ఇది 226వ శాఖ. ఈ ప్రాంతీయ గ్రామీణ బ్యాంక్ (ఆర్ఆర్‌బీ)కు స్పాన్సర్ బ్యాంక్‌గా ఇండియన్ బ్యాంక్ వ్యవహరిస్తుంది.
ఈ నూతన కేంద్రం సైతం చక్కటి సామర్థ్యం ప్రదర్శించిన ఉందని చెబుతూ తమ వినియోగదారులు, వారి అవసరాలను తీర్చడానికి బ్యాంకు కట్టుబడి ఉందని పునరుద్ఘాటించారు. ఇండియన్ బ్యాంక్ జనరల్ మేనేజర్ శ్రీ సూరిబాబు; ఛైర్మన్ శ్రీ ఏఎస్ఎన్ ప్రసాద్; సప్తగిరి గ్రామీణ బ్యాంక్ జీఎం శ్రీ రవి శంకర్‌తో పాటుగా ఇరు బ్యాంకులకు చెందిన బ్యాంకుల అధికారులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.