లోక్‌సభ స్పీకర్ చాంబర్‌లో కుట్ర జరిగింది.. లైవ్ ఆపేయమన జైపాల్ సలహా ఇచ్చాడు : ఉండవల్లి

సోమవారం, 26 సెప్టెంబరు 2016 (11:23 IST)
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విభజనలో తెరాస అధినేత కేసీఆర్ పాత్ర శూన్యమని రాజమండ్రి మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్ అన్నారు. ఫిబ్రవరి 18వ తేదీన లోక్‌సభలో అసలు ఏం జరిగింది!? హెడ్‌ కౌంట్‌ చేయకుండా, రాజ్యాంగ విరుద్ధంగా బిల్లును ఆమోదించారని ఉండవల్లి అరుణ్‌ కుమార్‌ తన ‘విభజన కథ’ పుస్తకంలో ఆరోపించారు. 
 
తన మాట చతురతతో అప్పటి కేంద్ర మంత్రి జైపాల్‌ రెడ్డి ఆర్టికల్‌ 367-3 గురించి చెప్పి, సుష్మా స్వరాజ్‌, స్పీకర్‌ మీరాకుమార్‌లను ఒప్పించారని ఊహించారు. తలుపులు మూసేసి, లైవ్‌ ఆపేయమని ఆయనే సలహా ఇచ్చారని అభిప్రాయపడ్డారు. ఆ రోజు స్పీకర్‌ చాంబర్లో కుట్ర జరిగిందని భావించారు. అయితే, విభజన కథ పుస్తకంలో ఉండవల్లి ‘ఊహ’లను జైపాల్‌ రెడ్డి ఖండించారు. 
 

వెబ్దునియా పై చదవండి