పోలవరం ఎమ్మెల్యే బాలరాజు కారుపై గుర్తు తెలియని దుండగులు దాడి (video)

ఐవీఆర్

సోమవారం, 29 జులై 2024 (22:55 IST)
పోలవరం ఎమ్మెల్యే, జనసేన పార్టీ నాయకుడు చిర్రి బాలరాజు కారుపై గుర్తు తెలియని దుండగులు దాడి చేసారు. ఈ దాడిలో కారు అద్దాలు ధ్వంసమయ్యాయి. ఈ ఘటనపై ఎమ్మెల్యే ఓ వీడియో సందేశాన్ని విడుదల చేసారు.
 
నియోజకవర్గంలో పనుల నిమిత్తం వెళ్లిన క్రమంలో కొందరు గుర్తు తెలియని వ్యక్తులు తన కారుపై ఇనుప రాడ్లతో దాడి చేసారని చెప్పారు. అదృష్టవశాత్తూ ఆ కారులో తను లేననీ, అందువల్ల నియోజవర్గ ప్రజలు ఎలాంటి భయభ్రాంతులకు లోను కావద్దని అన్నారు. కారుపై దాడి చేసిన వ్యక్తులను పోలీసులు గాలించి పట్టుకోవాలని అన్నారు.

బిగ్ బ్రేకింగ్ న్యూస్:-

పోలవరం జనసేన ఎమ్మెల్యే కారుపై గుర్తు తెలియని వ్యక్తులు కర్రలు, రాళ్లతో దాడి

పేదవాళ్లకు మంచి చేస్తే ఇంత అక్కసు ఎందుకు???????????? @chirri_balaraju @PawanKalyan pic.twitter.com/ZNyM0nbOSz

— గోదావరి జనసైన్యం (@Ewjanasainyam) July 29, 2024

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు