అర్థరాత్రి ఆగంతుకులు నాకు ఫోన్ చేస్తున్నారు... రక్షించండి... యామిని సాధినేని(Video)

సోమవారం, 10 జూన్ 2019 (15:56 IST)
తెదేపాలో సాధినేని యామిని అంటే తెలియని వారు వుండరు. ఈమధ్య కాలంలో ఆమె పాపులారిటీ విపరీతంగా పెరిగిపోయింది. ఐతే తెదేపా ఘోర పరాజయం తర్వాత తొలిసారిగా ఆమె మీడియా ముందుకు వచ్చారు. తనను గుర్తు తెలియని అగంతుకులు వేధిస్తున్నారని టీడీపీ అధికార ప్రతినిధి సాధినేని యామిని విమెన్ ప్రొటెక్షన్ ఎస్పీ సరితాకి ఫిర్యాదు చేశారు. 
 
తన పేరుపై నకిలీ ఫేస్ బుక్ ఖాతాలు తెరిచి అసభ్యకరమైన పోస్టులు పెడుతున్నారని పిర్యాదు చేశారు. గుర్తు తెలియని వ్యక్తులు అర్ధరాత్రి వేళ ఫోన్లు చేసి అసభ్యకరంగా మాట్లాడుతున్నారని,
 తనని, తన కుటంబ సభ్యులను బెదిరిస్తున్నారని ఆరోపించారు. ఈ విషయంపై సీఎం ముఖ్యమంత్రిని కలిసి వివరిస్తానని, తనకు సీఎం జగన్ వెంటనే రక్షణ కల్పించాలని విజ్ఞప్తి చేశారు.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు