ముక్కంటి దర్శనానికి భక్తుల అనుమతి.. 300 మందికే దర్శనం

మంగళవారం, 9 జూన్ 2020 (14:27 IST)
శ్రీకాళహస్తీశ్వరాలయంలో ముక్కంటి దర్శన భాగ్యం భక్తులకు దక్కనుంది. బుధవారం ఆలయంలో స్వామి, అమ్మవార్లకు శాంతి అభిషేకాల తర్వాత ఉద్యోగులు, మీడియా ప్రతినిధులతో ట్రయల్ రన్ నిర్వహించనున్నారు. 11వ తేదీ గురువారం నుంచి స్థానికులకు దర్శనాలు కల్పించనున్నారు. 12వ తేదీ నుంచి అన్ని ప్రాంతాల నుంచి వచ్చే భక్తులకు ఆలయ ప్రవేశం కల్పించనున్నారు. 
 
వృద్ధులు, పది సంవత్సరాల లోపు పిల్లలకు ఆలయ ప్రవేశాన్ని నిషేధించనున్నారు. ఆధార్ కార్డు తీసుకురావడంతోపాటు మాస్కు ధరించిన వారికే ఆలయ ప్రవేశం ఉంటుందని తెలిపారు. భక్తునికి.. భక్తునికి మధ్య క్యూలైన్లలో ఆరడగుల భౌతికదూరం ఉండేలా చర్యలు తీసుకోనున్నారు.
 
ఉదయం 6 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకే ఆలయ అధికారులు భక్తులకు దర్శనాలు కల్పించనున్నారు. ఒక గంటకు మూడు నుంచి ఐదొందల మందికి మాత్రమే దర్శన సౌకర్యం లభించనుంది. రాహు-కేతు సర్పదోష నివారణ పూజలకు అన్ని రకాల టిక్కెట్లతో కలిపి మొత్తం గంటకు 300ల మందికి మాత్రమే అనుమతి లభించనుంది.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు