బాలకృష్ణ అన్‌స్టాపబుల్ షోకు ఏపీ సీఎం చంద్రబాబు

ఠాగూర్

ఆదివారం, 20 అక్టోబరు 2024 (17:18 IST)
టాలీవుడ్ అగ్రహీరో నందమూరి బాలకృష్ణ ఓ ప్రైవేట్ టీవీ కోసం నిర్వహిస్తున్న అన్‌స్టాపబుల్ షోకు ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు మరోమారు హాజరుకానున్నారు. గతంలో ఓసారి ఆయన ఈ షోకు హాజరై సందడి చేసిన విషయం తెల్సిందే. ఇపుడు ఈ షో నాలుగో సీజన్ తొలి ఎపిసోడ్ టీడీపీ అధినేత బాబు ప్రారంభంకానుంది. 
 
త్వరలో ప్రారంభంకానున్న ఈ కార్యక్రమానికి సంబంధించిన తొలి ఎపిసోడ్‌లో ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ముఖ్య అతిథిగా కనిపించనున్నారు. ఈ ఎపిసోడ్‌ షూట్‌ ప్రస్తుతం అన్నపూర్ణ స్టూడియోస్‌లో జరుగుతోంది. ఈ మేరకు చంద్రబాబుకు పుష్పగుచ్ఛం అందించి అన్‌స్టాపబుల్‌ సెట్‌లోకి బాలయ్య ఆహ్వానించారు. దీనికి సంబంధించిన పలు ఫొటోలు నెట్టింట వైరల్‌గా మారాయి.
 
చంద్రబాబు ఈ టాక్‌ షోలో పాల్గొనడం ఇది తొలిసారి కాదు. 'అన్‌స్టాపబుల్‌ సీజన్‌-3'లోనూ ఆయన పాల్గొన్నారు. తన వ్యక్తిగత, రాజకీయ జీవితానికి సంబంధించిన ఎన్నో విషయాలను పంచుకున్నారు. ఆద్యంతం సరదాగా సాగిన ఆ ఎపిసోడ్‌ ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంది. అక్టోబరు 25 నుంచి కొత్త సీజన్‌ ప్రసారంకానుంది. అల్లు అర్జున్‌, దుల్కర్‌ సల్మాన్, 'కంగువా' చిత్రబృందం ఈ సీజన్‌లో సందడి చేసే అవకాశం ఉందని సమాచారం. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు