Jagan house vastu Changes: జగన్‌కు కలిసి రాని కాలం.. వాస్తు దోషాలే కారణమా? (video)

సెల్వి

మంగళవారం, 10 డిశెంబరు 2024 (19:00 IST)
Jagan House
Jagan house vastu Changes: ఏపీ మాజీ ముఖ్యమంత్రి, వైసీపీ అధినేత వైఎస్ జగన్ ఉన్నట్టుండి తన ఇంటికి మార్పులు చేశారు. తాడేపల్లి ఇంటికి వాస్తు దోషం ఉందని పండితులు చెప్పినట్టు సమాచారం. ఇటీవలే దక్షిణ దిశలో కంచె తొలగించారు. తాజాగా ఈశాన్యం మార్పులు చేశారు. 
 
కలిసి రాని కాలానికి వాస్తు దోషాలే కారణమని జగన్ భావిస్తూ.. తూర్పు ఈశాన్యం మూసి వుంచడం మంచిదని వాస్తు పండితుల సలహా మేరకు ఆ పని చేశారు. తాజా ఇంటికి తూర్పు- ఈశాన్యం వైపున్న కంచెను తొలగించారు. తూర్పు-ఈశాన్యం మూసివేయడం మంచిది కాదని వాస్తు పండితులు చెప్పడంతో ఈ మార్పులు చేస్తున్నారు. ఇంటి లోపల కూడా గతంలో చేసిన మార్పుల్ని తొలగిస్తున్నారు. 
 
ఏపీ మాజీ ముఖ్యమంత్రి, వైసీపీ అధినేత వైఎస్ జగన్ ఊహించని విధంగా అధికారం కోల్పోవడం, వరుసగా ఎదురౌతున్న ఇబ్బందులు, తిరుపతి లడ్డూ వ్యవహారం, కీలక నేతలు పార్టీ వీడటం వంటివాటికి కారణం జగన్ తాడేపల్లి ఇంటి వాస్తు అని వాస్తు పండితులు స్పష్టం చేశారు.

జగన్‌ తాడేపల్లి ప్యాలెస్‌లో వాస్తు మార్పులు

ఇటీవలే దక్షిణ దిశలో కంచె తొలగింపు

తాజాగా ఈశాన్యంలో మార్పులు

కలిసి రాని కాలానికి వాస్తు దోషాలే కారణమని జగన్ భావిస్తున్నట్లు సమాచారం

తూర్పు ఈశాన్యం మూసి ఉంచడం మంచిది కాదని వాస్తు పండితులు చెప్పినట్లు వార్తలు

జగన్ ఇంటికి వాస్తు… pic.twitter.com/AGfZsSQ9zq

— BIG TV Breaking News (@bigtvtelugu) December 10, 2024

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు