పెద్దిరెడ్డికి ఏమాత్రం సిగ్గు, లజ్జా ఉన్నా, దొంగఓటర్లను తరలించి గెలవాలి: వర్ల రామయ్య

శనివారం, 17 ఏప్రియల్ 2021 (20:03 IST)
రాష్ట్రంలో ప్రజాస్వామ్య వలువలు (బట్టలు ఊడదీశారు) ఊడ్చబడ్డాయని, తిరుపతి ఉపఎన్నిక చూస్తే, తానెందుకు అలా అనాల్సివచ్చిందో ప్రజలకు అర్థమవుతోందని, జగన్మోహన్ రెడ్డి నాయకత్వంలో అతిదారుణంగా ప్రజాస్వామ్యం ఖూనీ అవుతోందని  టీడీపీ జాతీయప్రధాన కార్యదర్శి మరియు పొలిట్ బ్యూరోసభ్యులు  మండిపడ్డారు.

శనివారం ఆయన మంగళగిరిలోని పార్టీ జాతీయ కార్యాలయంలో విలేకరులతో మాట్లాడారు. ఆ వివరాలు ఆయన మాటల్లోనే క్లుప్తంగా మీకోసం...
 
తిరుపతి ఉపఎన్నిక ఏ రకంగా జరుగుతుందో రాష్ట్రప్రజలంతా వారి పనులు ఆపిమరీ గమనించాలి. దానివల్ల ప్రభుత్వతీరు, ప్రభుత్వపెద్దల పనితీరు, ఈ ప్రభుత్వం ఏరకంగా అధికారంలోకి వచ్చిందో తెలుస్తుందని ప్రజలకు విజ్ఞప్తి చేస్తు న్నా. వంటచేసే మహిళలు, కార్ఖానాలో పనిచేసే కార్మికులు, పొలాల్లో ఉండే రైతులు, కూలీలు అందరూ వారిపనులుపక్కనెట్టి, కాసేపు టీవీలు చూడాలి. తిరుపతి ఉపఎన్నిక ఎలా జరుగుతుందో అందరూ తెలుసుకోవాలి.

ఉప ఎన్నిక పరిశీలకులుగా ఇతరరాష్ట్రాలనుంచి వచ్చిన ఐఏఎస్ అధికారులున్నారు.... ఇతర రాష్ట్రం నుంచి వచ్చిన సీనియర్ పోలీస్ ఆఫీసర్ ఎన్నికల పరిశీలకులుగా ఉన్నా రు.. సెక్రటేరియట్ లోచీఫ్ ఎలక్టోరల్ ఆఫీసర్ (సీఈవో) ఉన్నారు. ఢిల్లీలో  ఎన్నిక ల సంఘం ఉంది. ఇన్ని ఉన్నాకూడా జగన్మోహన్ రెడ్డి గారి దౌర్జన్యం యధాస్థితిలో సాగిపోతోంది. పెద్దిరెడ్డి దౌర్జన్యాలను ఆపే దిక్కులేదు ఈరాష్ట్రంలో.

పెద్దిరెడ్డి దెబ్బకు, జగన్మోహన్ రెడ్డి దెబ్బకు రాష్ట్రంలోని వ్యవస్థలన్నీ ఈ ఉపఎన్నికలో  సిగ్గుతో తలొంచుకున్నాయి.  పీలేరు నుంచి బస్సులో జనాలను తీసుకొస్తే, అక్కడున్నస్థానికులు వారినిఆపి, ఎక్కడివారు ఎందుకొచ్చారని నిలదీశారు.  స్థానికులతో పాటు, హోంగార్డు కూడా ఉన్నాడు. వారంతా బస్సు ఆపి, ఎక్కడినుంచి వస్తున్నారని నిలదీయడంతో బస్సులోని వారంతా దిగి పరిగెత్తారు. 

బస్సు డ్రైవర్ బస్సు ఆగిపోయిందని, దొంగఓట్లు వేయడానికి వచ్చామనిచెప్పి, కనుక్కొని బస్సును ఆపారని, బస్సులోని వారంతా పారిపోయారని, అతను బస్సు ఓనర్  కి ఫోన్ చేసి చెప్పాడు. (సదరు డ్రైవర్, బస్సు ఓనర్ తో  మాట్లాడుతున్న వీడియోను ఈసందర్భంగా రామయ్య విలేకరులకు ప్రదర్శించారు) 

ఆ బస్సు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి నియోజకవర్గం నుంచే వచ్చింది.  ఆ బస్సుడ్రైవర్ పెద్దిరెడ్డికి తెలుసు. బస్సులో వచ్చినవారంతా హోంగార్డుని, స్థానికులనుచూసి ఎందుకు పారిపోయారు? బస్సుని వారు ఆపకపోతే, అందులో వచ్చినవారంతా దొంగఓట్లు వేసేవారు కదా పెద్దిరెడ్డిగారు? ప్రజాస్వామ్యానికి ఏంఖర్మ పట్టింది పెద్దిరెడ్డి మంత్రిత్వంలో, ఆయనొక మంత్రా... జగన్మోహన్ రెడ్డి ఒక ముఖ్యమంత్రా? మీదొక ప్రభుత్వమా? 

మరో వీడియోను విలేకరులకు ప్రదర్శించిన రామయ్య,  క్యూలో నిలబడిన ఓటర్లను ఒక ఫ్రీలాన్స్ జర్నలిస్ట్ ప్రశ్నించాడు.  వారి ఐడీకార్డులు చూసి, వారు కడపనుంచి వచ్చారని గుర్తించి,  క్యూలో నిలబడిన వారిని తండ్రిపేరేమిటని ఆయన అడిగితే, కార్డులో ఉంది చూసుకోమని చెప్పారు. పెద్దిరెడ్డిగారు... మీ నియోజకవర్గంలో తండ్రిపేరు అడిగితే, కాగితాల్లో, కార్డుల్లో చూసుకోమని చెబుతారా? ఇదెక్కడి అన్యాయమండీ... ఇంత ఘోరం ఎక్కడైనా ఉందా? నకిలీ కార్డులు ఇచ్చిన వాడు ఏదైనా అడిగితే, సహజంగా పారిపోతాడు.

కానీ పెద్దిరెడ్డి జమానాలో దొంగలే ధైర్యంగా, దర్జాగా నిలబడి ఎదురు మాట్లాడుతున్నారు. దొంగ ఓట్లు వేయడానికి వచ్చివనారికి ఇచ్చిన గుర్తింపుకార్డుల వెనుక ఒక సీరియల్ నంబర్ ఉంది.  వాలంటీర్లంతా వైసీపీ ప్రచారకులని నిన్ననే చెప్పాను. వారంతా వైసీపీ ప్రచార ఇన్ ఛార్జ్ లని నేను నిన్ననే చెప్పాను. వారంతా వారివారి ప్రాంతాలలో చనిపోయినవారు, ఇతరరాష్ట్రాలకు వెళ్లిన వారు,  దేశాంతరం వెళ్లినవారి ఓటర్  లిస్ట్ అంతా తయారుచేసి, పెద్దిరెడ్డి  అండ్ కో కు ఇచ్చారు. వారేమో దొంగఓటర్లను సృష్టించి, నకిలీ ఓటర్ కార్డులను తయారుచేశారు. 

నా తండ్రి ఫలానా అతనని నేను ధైర్యంగా చెబుతాను. పెద్దిరెడ్డి పంపిన దొంగఓటర్లలా  కాగితాల్లో చూసుకోండని చెప్పను. ప్రజాస్వామ్యమా రాష్ట్రంలో నీ అడ్రస్ ఎక్కడ అని అడుగుతున్నాను. చిత్తూరుజిల్లాలో, తిరుపతిలో ప్రజాస్వామ్యం అడ్రస్ ఎక్కడుందో పెద్దిరెడ్డి, ఆయన అనుచరులు సమాధానంచెప్పగలరా? తాను అడిగే ప్రశ్నలకు పెద్దిరెడ్డి, ఆయన ప్రభుత్వం సిగ్గుతో కుంచించుకుపోవాలి. జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిత్వంలో దొంగఓటర్లు నిర్లజ్జగా, నిస్సిగ్గుగా క్యూలైన్లలో నిలబడ్డారు.  ఈ రాష్ట్రంలో ప్రజాస్వామ్యాన్ని ఎవరు కాపాడతారు? 

కాపాడాల్సిన ముఖ్యమంత్రి తప్పుడు విధానాలకు దొంగవిధానాలకు, అడ్డదారులకు సై అంటుంటే, ఆపాల్సిన పోలీస్ యంత్రాంగం నిమ్మకు నీరెత్తినట్టుగా నిస్తేజంగా కూర్చుంది. సవాంగ్ నాయకత్వం లోని పోలీస్ వ్యవస్థ ఉపఎన్నిక నిర్వహణలో ఘోరంగా విఫలమైంది. తిరుపతికి 4వేలబస్సులొస్తే, ఆ విషయం డీజీపీకి తెలియదా? బస్సులలో వచ్చినవారంతా స్వామివారిని దర్శించుకోవడానికి రాలేదు. పెద్దిరెడ్డిస్వామివారి తరుపున దొంగ ఓట్లు వేయడానికి వచ్చారు. పీఎల్ ఆర్ కళ్యాణమండపంలోఎంతమంది రాత్రి నిద్ర చేశారో పోలీసులకు, డీజీపీకి తెలియదా?

దొంగఓట్లు అంత నిర్లజ్జగా, నిస్సిగ్గుగా వేస్తుంటే పోలీసులకు తెలియదా?  ఎన్నికలకమిషన్ ఎంతలా, ఎన్నిరకాలుగా ఆదేశిస్తున్నా కింద అమలుచేయాల్సింది జగన్ బృందమే కదా. ఆ బృందం  చీఫ్ ఎలక్టోరల్ ఆఫీసర్ ఆదేశాలను సరిగా అమలుచేయడంలేదుకదా? దొంగఓట్లు వేసేవారిని ఎవరు ఆపుతారా? ఎవరో ఏజెంట్ దొంగ ఓట్ వేస్తున్నాడంటే, అతన్ని పట్టుకొని బూత్ లోనే పడేసి కొట్టారంట.  అలాగైతే ప్రజాస్వామ్యాన్ని ఎవరు కాపాడతారు? కొందరు ఆడవారు వ్యాన్లలో వచ్చి తిరుపతిలో దిగారు.

వారిభర్త పేరు, తండ్రిపేరు అడిగితే చెప్పడంలేదు. వారంతా పెద్దిరెడ్డి పంపిన దొంగఓటర్లే.  ఈ తంతు ఇలాగే కొనసాగితే ప్రజాస్వామ్యాన్ని ఎవరురక్షిస్తారు? తిరుపతిలో ప్రజాస్వామ్యాన్నికాపాడేది ఎవరని నేను ప్రశ్నిస్తున్నాను. బీజేపీ మహిళానేత శాంతారెడ్డి కొందరు దొంగఓటర్లనుపట్టుకున్నారు. జగన్మోహన్ రెడ్డికి ఏమాత్రం నైతిక విలువలున్నా, ఒక్కక్షణం ఆయన తాడేపల్లి నివాసం నుంచి శాంతారెడ్డి వైపుచూడాలి. ఆమెమాటలకు ఆయన సమాధానం చెప్పాలి.  ఆమె మాటలు వింటానికి ముఖ్యమంత్రి, పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, సజ్జల రామకృష్ణారెడ్డి సిద్ధమేనా? 

ఆ మాటలు వింటే పెద్దిరెడ్డి బతుకు ఇక అంతే... నానోటితో నేను చెప్పలేను. శాంతారెడ్డి మాటలకు ముఖ్యమంత్రి, పెద్దిరెడ్డి, సజ్జల రామకృష్ణారెడ్డికి సిగ్గేయడంలేదా? ఈ ప్రభుత్వం గాజులేసుకుందని ఆమె అంటుంటే వారికి సిగ్గుగా లేదా?  ఈరకంగా దొడ్డిదారిన, దొంగదారిన, గెలిచే గెలుపు కూడా ఒక గెలుపేనా?  

జగన్మోహన్ రెడ్డి విజయాలన్నీ ఇదే విధంగా వచ్చాయా? లక్షలకు లక్షల మెజారిటీలన్నీ ఇలానే సాధించారా?  జగన్మోహన్ రెడ్డి విజయాలన్నీ ఇలా దొంగ గెలుపులేనా?  ప్రజలు మెచ్చి, వారికి నచ్చి గెలిపించారని అనుకుంటున్నాం. దొంగఓట్లు వేయించడంలో మీరంతా ఇంతటి దిట్టలని ఇప్పుడే తెలిసింది.  ఈ రకంగా ఒకరిపేరుతో మరొకరు దొంగఓట్లు వేయడమే పెద్దనేరం,  సిగ్గుచేటు. అలా వచ్చినవారికి బుద్ధిలేదు. పంపినవెధవకు సిగ్గులేదు.

ఎంతో పకడ్బందీగా, నిష్ణా తులైన వారిలా దొంగఓటర్లు వ్యవహరించారు. రాష్ట్రంలో ఎన్నికలు ఎలా జరుగుతాయి అంటే ఈ రకంగా జరుగుతాయని దేశమంతా తెలియచేస్తాం. ఇంతటితో వదిలేదులేదు.  మీకు వచ్చిన మెజారిటీ అంతా ఈ విధంగా దొంగఓటర్లతో వచ్చిందే. 151సీట్లు కూడా ఇలానే వచ్చాయా?  ఇటువంటి నైపుణ్యం ఎక్కడనేర్చుకున్నారో చెప్పండి.

ఇదివరకు స్టూవర్ట్ పురం దొంగలబ్యాచ్ పేరుచెబితే, పోలీస్ స్టేషన్లలోని సెల్ ల తాళాలు ఊడిపోయేవి. ఇప్పుడు  ఈ పార్టీ పేరుచెబితే నకిలీఓట్లు కుప్పలుకుప్పులుగా పడిపోతున్నా యి. మీ గెలుపులన్నీ ఇలా తప్పుడుదారిలో సాధించినవేనా జగన్మోహన్ రెడ్డి గారు? 

కేంద్ర ఎన్నికల సంఘం వెంటనే స్పందించి, తిరుపతి ఉపఎన్నికను రద్దుచేయాలి. తిరిగి ప్రజాస్వాయుతంగా ఎన్నిక నిర్వహించండి. అడ్డదారిన, దొంగ దారిన తప్పుడు విధానాలతో ఎన్నిక జరిగింది. దొంగఓట్లు వేయించడంలో, దొంగఓటర్లను తయారుచేయడంలో ప్రభుత్వం ఆరితేరిపోయిందనడానికి ఇంత కంటే నిదర్శనం ఏంకావాలి? ఇంతకాలం తప్పడు విధానాలతో, అప్రజాస్వామికం గా, ఇలానే ఓట్లు వేసుకుంటారా? ప్రజాస్వామ్య విధానంలో గెలవాలిగానీ, ఇదేంటండీ? అందుకే  అన్నాను.

రాష్ట్రంలో  ప్రజాస్వామ్యం వలువలు ఊడదీయ బడ్డాయని.  ఈ విధంగా ఎన్నిక జరిగితే, దొంగలు, దోపీడిదారులు గెలవక, నిజమైన ప్రజాస్వామ్యవాదులు గెలుస్తారా?  నకిలీఓటర్ కార్డుల వెనుక నంబర్లు వేయడమేంటి... ఆనంబర్లు ఓటర్ లిస్ట్ లో ఉండటమేంటి?   ఈ వ్యవహారంపై చీఫ్ ఎలక్టోలర్ఆఫీసర్ (సీఈవో)కి ఫిర్యాదు చేస్తాం.  ఈవిధంగా జరిగిన ఎన్నిక అసలు ఎన్నికేనా? అందుకే సీఈవోకి ఫిర్యాదుచేయబోతున్నాం.  

తిరుపతిలో విధినిర్వహణలో ఉన్న ఒక పోలీస్ అబ్జర్వర్ కి రాత్రి నేను ఒక మెసేజ్ పంపాను. తిరుపతి కేంద్రంగా జరుగుతున్న దాన్ని ఆయనకు తెలియచేశాను.  ఫోన్ చేస్తే ఆయన స్పందించలేదు. నాపేరుతో నేనే స్వయంగా మెసేజ్ పంపాను. తిరుపతి ఉపఎన్నికతో సంబంధంలేని బయటివ్యక్తులను , దొంగఓట్లు వేయించ డానికి తిరుపతికి తీసుకొస్తున్నారని, కళ్యాణమండపాలు, లాడ్జీలు తనిఖీ చేయా లని, స్థానికంగా ఉన్న పోలీసులు సరిగా స్పందించడంలేదని మెసేజ్ పెట్టాను. 

నా మెసేజ్ పై ఆయన స్పందించలేదు. ఇంక ఎవరికి చెప్పాలి. పీఎల్ ఆర్ కళ్యాణ మండపంలో బయటివ్యక్తులున్నారని, బస్సులు వస్తున్నాయని, నకిలీ ఓటర్ కార్డులు తయారుచేశారని చెప్పాము. ఎక్కడా దేనిమీద స్పందించలేదు. టీడీపీ వారు ఏదైనాచేస్తే వెంటనే స్పందిస్తారు. డీజీపీ చేసేది ఇదే కదా.  వారు ధర్మం ప్రకారం పనిచేస్తారా..లేక పెద్దిరెడ్డి చెప్పింది చేస్తారా? పట్టుకున్న బస్సులను సీజ్ చేయాలి. దొంగఓటర్లను అరెస్ట్ చేసి, విచారణ జరపాలి. పోలీసులు సరిగా విధులు నిర్వర్తిస్తే, వ్యవహారమంతా బయటకొస్తుంది.

మా దగ్గరున్న ఆధారాలతో అన్ని వ్యవస్థల తలుపుతడతాం. తిరుపతి ఉపఎన్నిక రద్దుచేసి, తిరిగి ఎన్నిక నిర్వహిం చకుంటే, అధర్మానికి, అన్యాయానికి, అక్రమాలకు  మద్ధతిచ్చినట్టే లెక్క. తిరుపతి ఉపఎన్నికకు సంబంధించి, ఇదివరకే తాము అనేక ఫిర్యాదులిచ్చాం.  వాటిని మరలా ఎన్నికల సంఘానికి ఇస్తాము. వెంటనే ఎన్నిక రద్దుచేయాలని డిమాండ్ చేస్తాము. తిరుపతి ఉపఎన్నిక కేంద్రంగా జరుగుతున్న అరాచకాలపై టీడీపీ శ్రేణులు బాగా పోరాటంచేస్తున్నాయి.

ఇవన్నీ బయటపెట్టిందే టీడీపీ వారు కదా? జగన్ గెలుపులన్నీ, ఈ కోవకు చెందినవేనని తాము భావిస్తున్నాము. పెద్దిరెడ్డిని టచ్ చేసే ధైర్యం ఎవరికుంది అసలు?  నిన్ననే చెప్పాను రాష్ట్ర కేబినెట్ మొత్తం అక్కడే ఉందని, స్థానికేతరులైనవారికి ఇక్కడేం పని అని పోలీసులు మం త్రులను అక్కడనుంచి తరిమేయాలి కదా? దొంగఓట్లు వేయించే పెద్దిరెడ్డి నేర్పరి తనం ప్రజలందరికీ తెలిసిపోయింది.

ఆయనసాధించిన గెలుపులన్నీ అవినీతి, అప్రజాస్వామికమని అందరికీ తెలిసిపోయింది. ఏమాత్రం సిగ్గు, లజ్జాఉన్నా చేసిన తప్పుకి ఆయన తలవంచుకొని తిరగాలి. ఒక్కరోజుకూడా ఆయనకు మంత్రిగా కొనసాగే అర్హత లేదు. మిగిలిన రాజకీయపార్టీలు ఏంచేస్తున్నాయో ఎలా పోరాడు తున్నాయో అదితెలియదు. ప్రధాన ప్రతిపక్షంగా, ప్రభుత్వ దురాగతాలపై పోరాడాల్సిన బాధ్యత తెలుగుదేశానికుంది.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు