కాణిపాకం దేవస్థానం నందు ఆర్జిత సేవలు కుదింపు

శనివారం, 17 ఏప్రియల్ 2021 (19:53 IST)
స్వయంభు శ్రీ వరసిద్ధి వినాయక స్వామి దేవస్థానము కాణిపాకం శ్రీ స్వామి వారి దేవస్థానం నందు కరోనా వైరస్ నివారణ లో భాగంగా ఆర్జిత సేవలు కుదించారు. 18 నుండి శ్రీ స్వామి వారి దేవస్థానం నందు భక్తులకు మహాలఘు దర్శనం మాత్రమే అనుమతి.

సుప్రభాత సేవ ఉదయం 4:00 20 టికెట్లు మాత్రమే. పంచామృత అభిషేకము భక్తులకు 11:00 గంటలకు 20 టిక్కెట్లు మాత్రమే భక్తులకు అనుమతించబడును, 5:30 మరియు 9:00 అభిషేకములు రద్దు చేయడమైనది. పాలాభిషేకములు ఉదయం 7:30 మరియు సాయంత్రం 5:45 గంటలకు ఒక బ్యాచ్ కి 20 టిక్కెట్లు మాత్రమే.

గణపతి హోమం ఒక బ్యాచ్ 11:00, 20 టికెట్లు మాత్రమే  అనుమతించబడును, మరియు కల్యాణోత్సవం యధావిధిగా నిర్వహించబడును, నిజరూపదర్శనం, ప్రమాణాలు, నామకరణం,అన్నప్రాసన, మరియు అక్షరాభ్యాసం సేవలు రద్దు.
 
టికెట్లు కావాల్సిన భక్తులు దేవస్థానం ఆర్జిత సేవా కౌంటర్ ను సంప్రదించవలసినదిగా కోరడమైనది. ఆర్జిత సేవలో పాల్గొను భక్తులు తప్పనిసరిగా సాంప్రదాయ దుస్తులు ధరించి రావలేను.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు