టీడీపీ అధినేత, ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడికి కేంద్ర మంత్రి వెంకయ్య నాయుడు బుధవారం ఫోన్ చేశారు. అర్జెంటుగా ఢిల్లీకి రావాలంటూ కబురు పంపారు. ఏపీకి ప్రత్యేక హోదాపై గత కొన్ని రోజులుగా ఉన్న సస్పెన్స్‌కు తెరదించేందుకు కేంద్రం చర్యలు చేపట్టింది. ఇందులోభాగంగా బుధవారం ఉదయం నుంచి వరుస భేటీలతో ఏపీ ఎంపీలంతా ఢిల్లీలో బిజీబిజీగా ఉన్నారు.