ఈ నేపథ్యంలో గురువారం రాజ్యసభ ఛైర్మన్, వైఎస్ ఛైర్మన్‌లు సభకు హాజరుకాలేదు. దీంతో వైఎస్ ప్యానెల్ సభ్యుల్లో మొదటి వరుసలో ఉన్న విజయసాయిరెడ్డి గురువారం ఛైర్మన్ సీటులో ఆశీనులై సభా కార్యకలాపాలను నిర్వహించారు. తద్వారా ఆయనకు అరుదైన గౌరవం లభించినట్టయింది.
సభలో ప్రశ్నోత్తరాల సమయంలో ఇంగ్లీష్, హిందీ భాషల్లో మాట్లాడుతూ సభా కార్యకలాపాలను నడిపించారు. దీనికి సంబంధించిన వీడియోను వైసీపీ రాష్ట్ర పోలింగ్ బూత్ కమిటీల అధ్యక్షుడు వర్షవర్థన్ రెడ్డి సోషల్ మీడియా ఖాతాల ద్వారా వెల్లడించారు.