బెజ‌వాడ కేంద్రంగా సెక్స్ రాకెట్... అధికార పార్టీ కార్పొరేట‌ర్ల హ‌స్తం?

బుధవారం, 11 మే 2016 (18:22 IST)
బెజవాడ కేంద్రంగా సాగుతున్న ఓ సెక్స్ రాకెట్‌ను పోలీసులు గుట్టురట్టు చేశారు. నగరంలోని ఓ సీఐ ఫ్లాట్ పక్కనే జరుగుతున్న ఈ దందా ఎట్ట‌కేల‌కు వెలుగు చూసింది. పోలీసుల దాడిలో ఇద్దరు సెక్స్ వర్కర్లు, ఇద్దరు విటులు, ఒక నిర్వాహకుడిని అదుపులోకి తీసుకున్నారు. 
 
వ్యభిచార గృహం నిర్వాహకుల వద్ద పలువురు ప్రముఖుల సెల్ నంబర్లు దొరికినట్లు తెలుస్తోంది. వాటిలో నగరానికి చెందిన ఇద్దరు అధికార పార్టీ కార్పొరేటర్ల నంబర్లు కూడా ఉన్నట్లు సమాచారం. నగరంలో ఒకే చోట కాకుండా పలు ప్రాంతాల్లో ఈ దందా సాగుతున్నట్లు పోలీసులు గుర్తించారు. ఈ మేరకు నిందితులను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. 

వెబ్దునియా పై చదవండి