అయితే, బోగీల్లోని ప్రయాణికులంతా సురక్షితంగా ఉండటంతో అటు రైల్వే అధికారులు, ఇటు ప్రయాణికులు ఊపిరి పీల్చుకున్నారు. ఈ ఘటన ఏలూరు రైల్వే స్టేషన్‌లో శనివారం సాయంత్రం జరుగగా ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఈ ఎక్స్‌ప్రెస్ రైలు షిర్డీ నుంచి వస్తున్న షిర్డీ ఎక్స్‌ప్రెస్, ఇటు విశాఖకు వెళ్లాల్సిన విశాఖ ఎక్స్‌ప్రెస్ రైళ్లు రైల్వే స్టేషన్‌లో బాగా నెమ్మదించాయి.
ఆ సమయంలోనే విశాఖ ఎక్స్‌ప్రెస్ బోగీల లింకు వేరుపడింది. ఫలితంగా విశాఖ ఎక్స్‌ప్రెస్‌కు చెందిన ఎస్1, ఎస్2, ఎస్3 రైళ్లు బాగా విడిపోయాయి. అయితే ట్రైన్ చాలా నెమ్మదిగా వెళ్తున్న సమయంలో రైలు లింక్ ఊడిపోయింది. దీంతో పెను ప్రమాదం తప్పిపోయింది.