భారీ చేప దొరికితే... ఏ మత్స్యకారుడైనా ఎగిరి గంతేస్తాడు. కానీ, విశాఖలో ఈ చేప పడగానే ఆ మత్స్యకారుడు భోరుమన్నాడు. చేప చాలా పెద్దది. ఎక్కడెక్కడి నుంచో ప్రజలు వచ్చి ఆ పెద్ద చేపను వింతగా చూస్తున్నారు.
కానీ, దానిని పట్టిన వ్యక్తి మాత్రం తనకేం లాభం లేదని, పైగా నష్టమంటున్నాడు. విశాఖలో ఒక బోటుకు పులి బుగ్గల సొర్ర చిక్కింది. దానిని భీమిలి తీరం నుండి మూడున్నర గంటల పాటు శ్రమంచి, విశాఖ ఫిషింగ్ హార్బర్ తీసుకువచ్చారు.
టన్నున్నర బరువు, పన్నెండున్నర అడుగులు పోడవు ఉంది ఈ సొర. కానీ, ఈ చేప తనకు ఏ విధంగానూ ఉపయోగపడదని, తనకు డిజీల్, శ్రమ వృధా అయిందని మత్స్యకారుడు రాజేష్ ఆవేదన వ్యక్తం చేశాడు. అతిపెద్ద చేప కావడంలో విశాఖ ప్రజలు ఆసక్తిగా తిలకించారు.