ఆ తర్వాత ఆయన్ను ఆదివారం ఉదయమే స్వామీజీని ఉడిపి శ్రీకృష్ణ మఠానికి తరలించారు. మఠంలోనే వెంటిలేటర్స్, ఐసీయూ యూనిట్ ఏర్పాటు చేసి చికిత్స అందించినప్పటికీ ప్రయోజనం లేకపోయింది. అశేష భక్తులను దుఃఖ సాగరంలో ముంచుతూ ఆయన కొద్ది సేపటి క్రితమే తుదిశ్వాస విడిచారు. ఉడిపి 'అష్ట' మఠాల్లో పెజావర మఠం ఒకటి.
కాగా, విశ్వేశ తీర్ధ స్వామీజీ ఈనెల 20న శ్వాసపీల్చుకోవడం కష్టం కావడంతో ఆసుపత్రికి తరలించారు. తొలుత న్యుమోనియా సమస్యలకు చికిత్స అందించినట్టు వైద్యులు తెలిపారు. ఆయన ఆరోగ్యం మరింత విషమంగా మారిందని, బ్రెయిన్ డిస్‌ఫంక్షన్ అని పరీక్షలో తేలిందని, ఇంకా స్పృహలోకి రాలేదని శనివారంనాడు వైద్యలు తెలిపారు.
పెజావర మఠాథిపతి విశ్వేశ తీర్ధ స్వామీజీ మృతికి కర్ణాటక ముఖ్యమంత్రి బీఎస్ యడియూరప్ప తీవ్ర విచారం వ్యక్తం చేశారు. స్వామీజీ ఆత్మకు శాంతి కలగాలని, ఈ విషాదం నుంచి ఆయన అశేష భక్తులు కోలుకునేలా మానసిక స్థైర్యం కలిగించాలని ఆ కృష్ణ భగవానుని కోరుకుంటున్నానని అన్నారు.