మరోసారి సీన్ రీ-కన్స్ట్రక్షన్ చేశారు. ఇంటి పరిసరాల కొలిచి.. వీడియో, ఫొటోలు తీశారు. హత్య జరిగిన ముందురోజు రాత్రి దుండగులు ఏ విధంగా ఇంట్లోకి ప్రవేశించి ఉంటారో అధికారులు అంచనా వేశారు. ఆరుగురు సీబీఐ అధికారులు టీషర్టులకు పేర్లు రాసి వారి ద్వారా ట్రయల్స్ నిర్వహించారు.
ఈ కేసులో ఇప్పటికే అరెస్టైన సునీల్ యాదవ్, ఉమాశంకర్‌రెడ్డి హత్య జరిగిన రోజు పల్సర్ బైకులోనే వివేకా ఇంటికి వచ్చినట్టు సీబీఐ అధికారులు పులివెందుల కోర్టుకు తెలిపారు. ఆ నేపథ్యంలోనే వారు ఎలా వచ్చి ఉంటారో ఊహిస్తూ సీబీఐ వీడియో తీసింది.