వివేకా హత్య కేసు : సీఎం చంద్రబాబును కలిసిన డాక్టర్ సునీత దంపతులు

ఠాగూర్

మంగళవారం, 17 సెప్టెంబరు 2024 (17:51 IST)
వైకాపా నేత, మాజీ మంత్రి వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసు అంశంపై వివేకా కుమార్తె డాక్టర్ సునీత, ఆమె భర్త మంగళవారం ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుని కలిశారు. వివేకా పీఏ కృష్ణారెడ్డి ఫిర్యాదు మేరకు.. అప్పటి సీబీఐ ఎస్పీ రాంసింగ్‌తో పాటు తమపై అక్రమ కేసు పెట్టారని సీఎం దృష్టికి తెచ్చారు. కృష్ణారెడ్డి ఫిర్యాదులో నిజానిజాలపై విచారణ చేయించాలని కోరారు. రాంసింగ్‌పై కేసు వంటి అంశాలపై విచారణ చేయించాలని విజ్ఞప్తి చేశారు. సీఐడీ విచారణ ద్వారా వాస్తవాలు బయటకు తేవాలని కోరారు. సునీత విజ్ఞప్తిపై సీఎం చంద్రబాబు సానుకూలంగా స్పందించారు. తనకు అన్ని విషయాలు తెలుసని.. విచారణ చేయిస్తానని హామీ ఇచ్చారు. కాగా, వివేకా హత్య కేసు విచారణను సీబీఐ చేపట్టగా, ఈ కేసు విచారణ కోర్టులో సాగుతుంది. 
 
వందే భారత్ రైలుకు జెండా ఊపుతూ ట్రాక్‌పై పడిపోయిన బీజేపీ ఎమ్మెల్యే!! 
 
వందే భారత్ రైలుకు జెండా ఊపుతూ స్వాగతం పలుకుతున్న ఒక మహిళా ఎమ్మెల్యే ఒకరు అదుపుతప్పి ఫ్లాట్‌ఫామ్ నుంచి రైలు పట్టాలపై పడిపోయారు. అయితే, అదృష్టవశాత్తు ఆమెకు ఎలాంటి గాయాలు కాలేదు. ఈ ఘటన ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని ఇటావా రైల్వే స్టేషన్‌లో చోటుచేసుకుంది. 
 
ప్రధానమంత్రి నరేంద్ర మోడీ వర్చువల్‌గా ప్రారంభించిన వందే భారత్ రైలు ఆగ్రా నుంచి వారణాసికి వస్తున్న రైలుకు అనేక మంది బీజేపీ నేతలు ఇటావా రైల్వే స్టేషన్‌లో స్వాగతం పలికారు. ఈ కార్యక్రమానికి అనేక మంది బీజేపీ కార్యర్తలు స్టేషన్‌‍కు తరలివచ్చారు. దీంతో రైల్వేస్టేషన్‌తో పాటు ఫ్లాట్‌ఫామ్ కూడా కిక్కిరిసిపోయింది. ఈ క్రమంలో ఇటావా సర్దార్ ఎమ్మెల్యే సరితా భదౌరియా అదుపుతప్పి ఒక్కసారిగా కిందపడిపోయారు. ఇందుకు సంబంధించిన వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. 
 
ఫ్లాట్‌ఫాంలోకి వస్తున్న రైలుకు స్వాగతం చెప్పేందుకు స్టేషన్‌కు స్థానికులు భారీ సంఖ్యలో తరలివచ్చారు. దీంతో రైల్వే స్టేషన్ కిక్కిరిసిపోయింది. ఒకానొక సమయంలో పరిస్థితి అదుపుతప్పేలా కనిపించింది. ఈ క్రమంలోనే తోపులాటు చోటుచేసుకోవడంతో  ఎమ్మెల్యే కిందపడిపోయారు. ఆ తర్వాత ఇతర నేతలు ఆమెను పైకి లేవనెత్తారు. పెద్దగా గాయాలు కాకపోవడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. స్టేషన్ కిక్కికిరిసిపోయాలా జనాన్ని అనుమతించడంపై తీవ్రస్థాయిలో విమర్శలు వస్తున్నాయి. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు