విశాఖలో కరోనా విధ్వంసం : విశాఖ కలెక్టర్‌కు కరోనా ...

శుక్రవారం, 7 మే 2021 (12:21 IST)
దేశంలో కరోనా రెండో దశ వ్యాప్తి ఏ విధంగా ఉందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. తీవ్ర స్థాయిలో దేశంలో విస్తరిస్తోంది. ఉన్నతాధికారులు సైతం కరోనా బారిన పడుతున్నారు. విశాఖ జిల్లాలో ఉన్నతాధికారులు కరోనా బారినపడుతున్నారు. 
 
తాజాగా కలెక్టర్ వినయ్ చంద్, జీవీఎంసీ కమిషనర్ సృజనకు కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయింది. అలాగే విశాఖ జిల్లాకు చెందిన ముగ్గురు జాయింట్ కలెక్టర్లు, డీఆర్వో, ఆర్డీవోలకు కరోనా పాజిటివ్‌ అని తేలింది. 
 
మరోవైపు కృష్ణా జిల్లాలో గురువారం కొత్తగా 548 పాజిటివ్‌ కేసులు వెలుగు చూశాయి. కొవిడ్‌ ఆసుపత్రుల్లో చికిత్స పొందుతూ మరో నలుగురు బాధితులు మరణించారు. ఈ కొత్త కేసులతో కలిపి జిల్లాలో మొత్తం పాజిటివ్‌ కేసుల సంఖ్య 66,811 కి చేరుకున్నాయి. కొవిడ్‌ మరణాలు అధికారికంగా 799 కి పెరిగాయి. ఇంకా 8,520 మంది పాజిటివ్‌ బాధితులు కొవిడ్‌ ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్నారు.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు