తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే, జాలరిపేటకు చెందిన దంపతులకు పదేళ్ళ కుమార్తె, 12 యేళ్ళ బాలుడు ఉన్నాడు. వీరిద్దరినీ ఓ సంక్షేమ హాస్టల్‌లో ఉంచి చదివిస్తున్నారు. ఈ క్రమంలో వేసవి సెలవులు కావడంతో కుమార్తె ఇంటికి వచ్చింది. కుమార్తెను ఇంట్లో వదిలిపెట్టి తల్లి పనుల కోసం ఉదయాన్నే వెళ్లింది. ఇంట్లో ఎవరూ లేకపోవడంతో ఇదే అదునుగా భావించిన కన్నతండ్రి.. పదేళ్ళ కుమార్తెపై అఘాయిత్యానికి పాల్పడేందుకు యత్నించాడు. అయితే, ఆ బాలిక గట్టిగా ప్రతిఘటించడంతో అక్కడి నుంచి పారిపోయాడు.
సాయంత్రం ఇంటికి వచ్చిన తల్లికి ఈ విషయం కుమార్తె చెప్పి బోరున విలపించింది. దీంతో ఆగ్రహోద్రుక్తురాలైన ఆ మహిళ.. రాత్రి ఇంటికి వచ్చిన భర్తపై తిరగబడింది. వంటిట్లో ఉండే కత్తిపీటను తీసుకుని దాడి చేసేందుకు యత్నించింది. దీంతో ఆ కామాంధుడు ప్రాణాలు అరచేతిలో పట్టుకుని పారిపోయాడు. ఈ విషయం ఇరుగుపొరుగు వారి ద్వారా పోలీసులకు చేరింది. అయితే, భర్తపై భార్యపై కేసు పెట్టేందుకు ముందుకు రాలేదు. దీంతో ఆ కామాంధుడు తప్పించుకుని తిరుగుతున్నాడు.