రాజధాని ఢిల్లీ నగరంలో ఈ యేడాది తొలి మూడున్నర నెలల్లో ప్రతీ రోజు ఐదుగురు మహిళలపై అత్యాచార ఘటనలు జరిగినట్లు ఢిల్లీ పోలీసులు వెల్లడించారు. ఢిల్లీలో ఈ యేడాది ఏప్రిల్ 15 నాటికి 578 రేప్ కేసులు, మహిళలపై వేధింపులకు సంబంధించి 883 కేసులు నమోదైనట్లు తెలిపారు.
గతేడాది ఇదే సమయానికి 563 రేప్ కేసులు నమోదుకాగా, 944 వేధింపుల కేసులు నమోదైనట్లు పోలీసులు వెల్లడించాయి. గతేడాది ఢిల్లీలో నమోదైన రేప్ కేసుల్లో 96 శాతం బాధితులకు నిందితులు తెలిసినవారేనని పోలీసులు దర్యాప్తులో వెల్లడైంది.