వైజాగ్ - సికింద్రాబాద్‌ల మధ్య వారంలో ఆరు రోజులే వందేభారత్

శుక్రవారం, 13 జనవరి 2023 (09:21 IST)
సికింద్రాబాద్ - వైజాగ్ స్టేషన్ల మధ్య ఈ నెల 19వ తేదీ నుంచి వందే భారత్ రైలు సేవలు ప్రారంభంకానున్నాయి. సికింద్రాబాద్ స్టేషన్‌లో జరిగే కార్యక్రమంలో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ పాల్గొని ఈ రైలు సేవలను ప్రారంభిస్తారు. అయితే, ఈ రైలు ఈ రెండు స్టేషన్ల మధ్య వారంలో ఆరు రోజులు నడుస్తుంది. ఆదివారం మాత్రం రైలు సేవలు ఉండవని దక్షిణ మధ్య రైల్వే అధికారులు వెల్లడించారు.
 
సోమవారం నుంచి శనివారం వరకు ప్రతి రోజూ విశాఖపట్టణంలో ఉదయం 5.45 గంటలకు బయలుదేరి మధ్యాహ్నం 2.15 గంటలకు సికింద్రాబాద్‌కు చేరుకుంటుంది. తిరుగు ప్రయాణంలో మధ్యాహ్నం 3 గంటలకు సికింద్రాబాద్ స్టేషన్‌‍లో బయలుదేరి విశాఖపట్టణానికి రాత్రి 11.30 గంటలకు చేరుకుంటుంది. ఈ రైలు రాజమండ్రి, విజయవాడ, ఖమ్మం, వరంగల్ స్టేషన్లలో మాత్రం ఆగుతుంది. 
 
విశాఖలో ఉదయం 5.45 గంటలకు బయలుదేరే వందే భారత్ రైలు రాజమండ్రికి 7.55/7.57కు, విజయవాడకు 10/10.05, ఖమ్మంకు 11/11.01, వరంగల్‌కు మధ్యాహ్నం 12.05/12.06, సికింద్రాబాద్‌కు 14.15 గంటలకు చేరుకుంటుంది. తిరుగు ప్రయాణంలో సికింద్రాబాద్‌లో మధ్యాహ్నం 15.00 గంటలకు బయలుదేరి వరంగల్‌కు సాయంత్రం 16.35/16.36, ఖమ్మంకు 17.45/17.46, విజయవాడకు 19.00/19.05, రాజమండ్రికి 20.58/21.00. విశాఖపట్టణంకు 23.30 గంటలకు చేరుకుంటుంది.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు