దళారుల మాయలోపడొద్దు... ఓటీఎస్ లో వక్ఫ్ భూముల రిజిస్ట్రేషన్ జరగదు!

సోమవారం, 13 డిశెంబరు 2021 (13:07 IST)
ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఓటీఎస్ పథకం కింద వక్ఫ్ భూములను రిజిస్ట్రేషన్ చేయిస్తామని కొంతమంది దళారులు చేస్తున్న ప్రచారాన్ని నమ్మి మోసపోవద్దని జిల్లా వక్ఫ్ బోర్డు ఇన్ స్పెక్టర్  ఖాజా మస్తాన్  విజ్ఞప్తి చేశారు. వక్ఫ్ బోర్డు స్థలాల్లో నివాసితులను టార్గెట్ చేసి దళారులు రూ.10 వేల నుంచి రూ.15 వేలు వసూలు చేస్తున్నట్లు తమ దృష్టికి వచ్చిందన్నారు. వక్ఫ్ బోర్డు ఆస్తులు రిజిస్ట్రేషన్ చేయడానికి ఎట్టి పరిస్థితుల్లో వీలు కాదని, ఎవరైనా డబ్బులు వసూలు చేస్తే వెంటనే వక్ఫ్ బోర్డు కార్యాలయానికి సమాచారం అందిస్తే, వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.
 
 
కొండపల్లి హజరత్ ముర్తజా అలీ పంజా సర్వే నంబర్ 212ఏ, 212బీ 18.30 ఎకరాలు, బ్యాంకు సెంటర్ లో 293/1లో 37 సెంట్లు, 293/6లో హజరత్ అజమ్ ఖాన్ పంజా 438/1లో బాషా అలం పంజా జామియా మసీదు, బోదుల పంజా, రజాక్ షా దర్గా, సులేమాన్ దర్గా, హైదర్ బేగ్ పంజా, జల్ జలే సాహెబ్ పంజా, బిబీ జాన్ పంజా, బేగ్ పంజా 438 సర్వే నంబర్, మసీదు గడ్డ ఖిల్లా రోడ్డు 289 సర్వే నంబర్ లో బీ కాలనీ 433, 436, కటికల పంజా403. మెయిన్ బజార్   గాలిబ్ షహీద్ దర్గా సర్వే నంబర్ 389  401  ఇబ్రహీంపట్నం ఖాజీమాన్యం 244 సర్వే నంబర్లలో వక్ఫ్ భూములు ఉన్నాయని చెప్పారు. వీటిలో ఎవరైనా దళారులు అక్రమాలకు పాల్పడితే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. మోసగాళ్ల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని కోరారు.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు