గ్రామాల్లోకి నేను రాకూడదా? ఇదేమైనా మీ అయ్య జాగీరా? పవన్ ప్రశ్న

శుక్రవారం, 4 డిశెంబరు 2020 (15:04 IST)
జనసేన అధినేత పవన్ కళ్యాణ్ నివర్ తుఫాన్ ధాటికి దెబ్బతిన్న రైతులను పరామర్శించేందుకు శుక్రవారం నెల్లూరు జిల్లాలో పర్యటిస్తున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... తను ప్రజల సమస్యల కోసం మాట్లాడటానికి వస్తే వైసిపి వాళ్లు నన్ను ఆపాలని చూస్తున్నారు, ఆపడానికి మీరెవరు, ఇదేమైనా మీ అయ్య జాగీరా? మీ సొంతం అనుకుంటున్నారా? అంటూ ప్రశ్నించారు.
 
తను రైతులను పరామర్శించేందుకు వస్తున్నాననీ, ఇందులో మీకొచ్చిన ఇబ్బంది ఏంటంటూ ప్రశ్నించారు. ఇసుక, మద్యం అమ్ముకుని కోట్లు ఆర్జిస్తున్న ప్రభుత్వం, నష్టపోయిన రైతుకి 10 వేల రూపాయలను ఇవ్వలేదా అంటూ ప్రశ్నించారు. రైతులను రాష్ట్రప్రభుత్వం తక్షణం ఆదుకోవాలని డిమాండ్ చేసారు.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు