మహబూబ్‌నగర్ జిల్లాలో దారుణం జరిగింది. చిన్నచింతకుంట మండలం, పర్దిపూర్‌లో ఓ మహిళ తన భర్తను హత్యచేసి ఇంట్లోనే పూడ్చిపెట్టింది. దీన్ని గ్రామస్తులు గుర్తించడంతో నిందితురాలు పరారైంది.
గ్రామస్తులు పోలీసులకు పిర్యాదు చేయగా సంఘటనా ప్రదేశానికి చేరుకుని, మృత దేహాన్ని పోస్టుమార్టం నిమత్తం ఆస్పత్రికి తరలించి నిందితురాలు కోసం గాలింపుచర్యలు చేపట్టారు.
కాగా, ఈ భార్యాభర్తల మధ్య గత కొంతకాలంగా మనస్పర్థలు ఉండటంతో నిత్యం గొడవపడుతూ వచ్చేవారనీ తెలిపింది. ఈ దారుణ ఘటన విషయం తెలుసుకున్న పోలీసులు హత్యా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని స్వాధీనం చేసుకుంది.