ఈ సందర్భంగా నిర్మాత చింతపల్లి రామారావు మాట్లాడుతూ, ఒక మంచి కమర్షియల్ ఎలిమెంట్స్ తో బిగ్ హిట్ మూవీని నిర్మించాలని నార్నె నితిన్, వేగేశ్న సతీష్ కాంబినేషన్లో ఈ చిత్రాన్ని రూపొందించాం. మా చిత్ర హీరో నార్నె నితిన్ ఇటీవల మంచి యూత్ ఫుల్ ఎంటర్టైనర్ మూవీస్ తో వరుస విజయాలు అందుకుంటున్నారు. ఇక శ్రీ శ్రీ రాజావారు విషయానికొస్తే మంచి గ్రామీణ నేపథ్యంలో సాగే వెరైటీ ఫ్యామిలీ ఎంటర్టైనర్ ఇది.పూర్తి కమర్షియల్ ఫార్మాట్ లో భారీ తారాగణంతోతెరకెక్కించారు దర్శకుడు సతీష్ వేగేశ్న. అలాగే ఎన్టీఆర్ ఎంతో మెచ్చి, ఈ కథను ఎంపిక చేశారు. ఆయన అంచనాల మేరకు దర్శకుడు ఈ చిత్రాన్ని ఎక్కడా రాజీపడకుండా తెరకెక్కించారు. కచ్చితంగా ఈ జూన్ 6న నార్నె నితిన్ ఖాతాలో ఆయ్ , మ్యాడ్ తరహాలోమరో సూపర్ హిట్ హిట్ పడుతుందని గట్టిగా నమ్ముతున్నాం. అని అన్నారు.