వివాహేతర సంబంధాలు.. భర్తను ప్రియుడితో కలిసి చంపేసిన భార్య

సెల్వి

శనివారం, 11 అక్టోబరు 2025 (16:33 IST)
వివాహేతర సంబంధాల కారణంగా అనేక సంఘటనలు జరగ్గా..తాజాగా చిత్తూరు జిల్లాలో మరో ఘటన వెలుగులోకి వచ్చింది. ప్రియుడితో కలిసి తన భర్తను ఓ మహిళ దారుణంగా చంపేసింది. ఏపీలోని చిత్తూరు పట్టణంలోని దుర్గమ్మ గుడి వీధిలో అక్టోబరు 6వ తేదీన బి. వెంకటేష్ అనే వ్యక్తి అనుమానాస్పద స్థితిలో మృతి చెందాడు. 
 
పోలీసుల విచారణలో భార్యే హంతకురాలని తేలింది. వెంకటేష్ రెండవ భార్య తులసి మునియమ్మ అలియాస్ కావ్య(22)పై అనుమానం రావడంతో పోలీసులు విచారణ జరిపారు. ఈ విచారణలో కావ్యకు సురేష్ (23)అనే వ్యక్తితో వివాహేతర సంబంధం ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. 
 
వీరి అక్రమ సంబంధం గురించి తెలిసిన కావ్య భర్త.. ఆమెన నిలదీశాడు. దీంతో తమ సుఖానికి భర్త అడువస్తున్నాడని ప్రియుడు సురేశ్ తో కలిసి కావ్య.. వెంకటేశ్‌ను చంపేసింది. 
 
ఎవరికి అనుమానం రాకుండా ఉండేందుకు.. వెంకటేష్ ను తాడుతో వేలాడదీసి.. ఆత్మహత్యగా చిత్రీకరించేందుకు యత్నం చేశారు. అయితే తర్వాత విచారణలో అది హత్య అని తేలగా దర్యాప్తు వేగవంతం చేశారు.

వెబ్దునియా పై చదవండి