కుటుంబ పోషణ కోసం భార్య గీత అక్కడ తెలిసిన రాజు, విక్రమ్‌ల వద్ద 50 వేల రూపాయలను అప్పుగా తీసుకుంది. దీంతో అప్పు ఇచ్చిన సాకుతో విక్రమ్.. గీతతో వివాహేతర సంబంధాన్ని ఏర్పరుచుకున్నారు. దీంతో ఇటీవల కాలంలో శ్రీశైలం, గీతలు కలిసి తమ స్వగ్రామమైన బూరుగుపల్లికి వచ్చారు.
జీవనోపాధి కోసం శ్రీశైలం రోజు కూలిగా పని చేస్తున్నాడు. కాగా తన భర్త శ్రీశైలంని ఎలాగైనా అడ్డు తొలగించుకోవాలని పథకం పన్నిన భార్య గీత, ఆమె తల్లి, రాజు, విక్రమ్ కలసి ప్లాన్ వేశారు.