అటు తెలంగాణ ప్రభుత్వాన్ని కూడా మలేరియా నివారణ చర్యలకు సంబంధించి కేంద్ర ప్రభుత్వం అభినందించింది. ప్రభుత్వ కృషిని గుర్తించి తెలంగాణను కేటగిరీ 2 నుంచి కేటగిరీ 1లో చేర్చింది. ఆరేళ్లలో తెలంగాణ ప్రభుత్వం మలేరియా నివారణకు చేపట్టిన చర్యలకు గాను ఇవాళ ఢిల్లీలో జరిగే కార్యక్రమంలో సత్కరించనుంది. ఈ విషయాన్ని మంత్రి హరీశ్ రావు ట్విట్టర్ ద్వారా ప్రకటించారు.
అలాగే, దోమల నిర్మూలనకు ఇండోర్ రెసిడ్యుయల్ స్ప్రేయింగ్‌ను చేపట్టింది. ఫ్రైడే డ్రైడే పేరిట అన్ని గ్రామ, వార్డు సచివాలయాల్లో దోమల కట్టడి, మలేరియాను నిరోధించేందుకు చర్యలు చేపట్టింది.