కడప ఎంపీగా అనివాష్ రెడ్డి గెలుపు.. వైఎస్ షర్మిలకు ఎన్ని ఓట్లు వచ్చాయంటే...

వరుణ్

బుధవారం, 5 జూన్ 2024 (09:34 IST)
ఏపీలోని కడప లోక్‌సభకు జరిగిన ఎన్నికలు ఈ దఫా ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. రాజకీయ, కుటుంబ కారణాల రీత్యా అందరి దృష్టిని ఆకర్షించింది. కడప ఎంపీ స్థానంలో వైకాపా అభ్యర్థిగా అవినాశ్ రెడ్డి పోటీ చేశారు. ఈ స్థానం నుంచి కాంగ్రెస్ అభ్యర్థిగా షర్మిల పోటీ చేసి, అవినాశ్ రెడ్డికి వ్యతిరేకంగా ప్రచారం చేశారు. అయితే, కడప ఓటర్లు మాత్రం అవినాశ్ రెడ్డికే పట్టంకట్టారు. టీడీపీ రెండో స్థానంలో నిలువగా, షర్మిల మూడో స్థానానికే పరిమితమయ్యారు. 
 
వివేకా హత్య కేసులో వైఎస్ అవినా్శ్ రెడ్డి ఓ నిందితుడు. దీంతో ఆయన అనేక ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. ఆయన్ను లక్ష్యంగా చేసుకుని షర్మిల, సునీతలు తీవ్ర స్థాయిలో విమర్శల దాడి చేశారు. దీంతో కడప స్థానంపై ఆసక్తి నెలకొంది. కడప ఎంపీ స్థానానికి సంబంధించి మంగళవారం తీర్పును వెలువరించారు. ఈ ఎన్నికల్లో అవినాశ్ రెడ్డి విజేతగా నిలిచారు. ఆయనకు 62,695 ఓట్ల తేడాతో ఆయన తన సమీప టీడీపీ అభ్యర్థి భూపేస్ రెడ్డిపై విజయం సాధించారు. 
 
ఇక్కడ కాంగ్రెస్ అభ్యర్థిగా బరిలో దిగిన ఏపీ పీసీసీ చీఫ్ షర్మిల మూడో స్థానంతో సరిపెట్టుకున్నారు. ఆమెకు 41,039 ఓట్లు వచ్చాయి. మరోమారు కడప ఎంపీగా నెగ్గిన అవినాశ్ రెడ్డికి 6,05,143 ఓట్లు రాగా, రెండో రెండో స్థానంలో ఉన్న టీడీపీ అభ్యర్థి భూపేశ్ రెడ్డికి 5,42,448 ఓట్లు లభించింది. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు