జిల్లాల పునర్విభజన అంత అవసరమా?: ఆనం సెన్సేషనల్ కామెంట్స్

శుక్రవారం, 18 ఫిబ్రవరి 2022 (09:52 IST)
కొత్త జిల్లాల ఏర్పాటు ప్రక్రియ మార్చి 18 నాటికి పూర్తి చేసేలా ప్రభుత్వం ప్రణాళిక సిద్ధం చేసింది ఏపీ సర్కారు. ఏప్రిల్‌ 2 నుంచి కొత్త జిల్లాల్లో కార్యకలాపాలు ప్రారంభించేందుకు అధికారులు ప్రణాళికను రూపొందించారు.
 
రాష్ట్రంలో కొత్త జిల్లాల ఏర్పాటుకు ప్రాథమిక నోటిఫికేషన్లు, సవరణ ఉత్తర్వులపై జిల్లాల కలెక్టర్లు ప్రజల నుంచి సలహాలు, సూచనలను మార్చి 3వ వరకు స్వీకరిస్తారు. ప్రస్తుతం ఉన్న 13 జిల్లాలు 26 కానున్నాయి.
 
ఉగాది నాటికి జిల్లాల పునర్వ్యవస్థీకరణ ప్రక్రియను పూర్తి చేసి కొత్త జిల్లాలను అమల్లోకి తెచ్చేలా ప్రభుత్వం కసరత్తు చేసింది.
 
ఈ నేపథ్యంలో ఏపీలో  కొత్త జిల్లాల ఏర్పాటుపై నెల్లూరు జిల్లా వెంకటగిరి వైసీపీ ఎమ్మెల్యే ఆనం రామనారాయణ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. 
 
కొత్త జిల్లాలు ఏర్పడితే వేల కోట్ల నిధులు కావాలని ఆనం తెలిపారు. ఇప్పుడు జిల్లాల పునర్విభజన అంత అవసరమా అని ఆయన ప్రశ్నించారు. తమకు రోడ్లు వేయడానికే నిధులు లేవని.. రోడ్లు వేసుకునేందుకు  తెచ్చుకునే ప్రయత్నం చేస్తున్నామన్నారు.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు