ఏపీలో సినిమా టిక్కెట్ల రేట్లను ఖరారు - కనీస టిక్కె ధర రూ.40?

శుక్రవారం, 18 ఫిబ్రవరి 2022 (08:52 IST)
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో చెలరేగిన సినిమా టిక్కెట్ల వివాదానికి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఫుల్‌స్టాఫ్ పెట్టేలా ఉంది. అటు చిత్రపరిశ్రమకు, ఇటు ప్రేక్షకులను సంతోష పెట్టేలా నిర్ణయం తీసుకునే దిశగా అడుగుుల వేస్తుంది. ఇందులోభాగంగా, సినిమా టిక్కెట్ల ధరలను మూడు శ్లాబులుగా నిర్ణయించి, కనీస టిక్కెట్ ధర రూ.40గా ఖరారు చేసినట్టు సమాచారం. అయితే, దీనిపై మార్చి మొదటివారంలో అధికారిక ప్రకటనను వెల్లడించే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది. 
 
రాష్ట్రంలో ఉన్న సినిమా థియేటర్లను ఏసీ, నానా ఏసీ, మల్టీప్లెక్స్‌లుగా విభజించి, మూడు శ్లాబుల్లో టిక్కెట్ ధరల్లో భాగంగా గ్రామీణ ప్రాంతాల్లో కనీస ధర రూ.40గా, పట్టణ ప్రాంతాల్లో రూ.70గా ఉండేలా చూడాలని సూచించినట్టు చెప్పారు. ప్రభుత్వం దీనికి కాస్త అటుఇటుగా నిర్ణయం తీసుకునే అవకాశాలు ఉన్నట్టు సమాచారం. 
 
అయితే, సినిమా బడ్జెట్ రూ.వంద కోట్లు దాటినపుడు మాత్రం టిక్కెట్ ధరలు ఎలా ఉండాలన్న దానిపై చర్చలు జరుపుతున్నట్టు సమాచారం. అలాగే, ఐదో ఆటపై కూడా ప్రభుత్వం చర్చించింది. చిన్న సినిమాలకు ప్రాధాన్యం ఇవ్వాలని నిర్ణయించినట్టు తెలుస్తుంది. సినిమా హాళ్ళలో టిక్కెట్ ధర కంటే తినుబండరాల ధరలే ఎక్కువగా ఉన్న అంశంపై కూడా ప్రభుత్వం దృష్టిసారించింది. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు