ఏపీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి ఆస్తులు ఎక్కడెక్కడ ఉన్నాయో తెలుసా?

వరుణ్

మంగళవారం, 23 ఏప్రియల్ 2024 (10:51 IST)
ఏపీ ముఖ్యమంత్రి, వైకాపా అధినేత జగన్మోహన్ రెడ్డి తనకున్న ఆస్తుల వివరాలను బహిర్గతం చేశారు. ఆనకు ఏకంగా 550 కోట్ల పైచిలుకు ఆస్తులు ఉన్నట్టు ప్రకటించారు. వీటిలో స్థిర, చరాస్తులతో పాటు ఫిక్స్‌డ్ జిపాజిట్లు, బీమా, ఇతరులకు ఇచ్చిన అప్పులు ఇలా అన్నీ ఉన్నట్టు వెల్లడించారు. 
 
ముఖ్యంగా ఇడుపులపాయలో రూ.35.50 ఎకరాల వ్యవసాయ భూమి ఉంది. ఇడుపులపాయ, భాకరాపురం, బంజారాహిల్స్, సాగర్ సొసైటీలో ఆస్తులున్నాయి. వ్యవసాయేతర భూముల విలువ రూ.46,78,89,900గా చూపించారు. భారతి సిమెంట్స్‌లో జగన్‌కు రూ.36 కోట్లు, కార్నియల్, ఏసియో హోల్డింగ్ ప్రైవేటు లిమిటెడ్ రూ.8 లక్షలు, క్లాసికొ రియాలిటీ ప్రైవేటు లిమిటెడ్ రూ.65.19 కోట్లు, సండూర్ పవర్లో రూ.130 కోట్లు, సరస్వతి పవర్ ఇండస్ట్రీస్‌లో రూ.27.60 కోట్లు, సిలికాన్ బెండర్స్ ప్రైవేటు లివి టెడ్ రూ.2.86 కోట్లు. మొత్తం రూ.263.64 కోట్లు పెట్టుబడులు ఉన్నాయి. అప్పులు రూ.1.10 ఉన్నట్లు తెలిపారు. జగన్ రూ.4.56 కోట్లు ట్యాక్స్ కట్టినట్టు తెలిపారు. జగన్ కుటుంబానికి సొంత కారు లేకపోవడం విశేషం. అలాగే జగన్‌కు తులం బంగారు కూడా లేదు.
 
ఇక ఆయన భార్య భారతి పేరిట రూ.5.29 కోట్ల విలువ చేసే 6.47 కిలోల బంగారు, వజ్రాలు ఉన్నాయి. ఎర్రగుడిపల్లె, కచి వారిపల్లె, పులివెందుల, రాయదుర్గం, తాడేపల్లిలో ఆస్తులు ఉన్నాయి. వీటి విలువ రూ.56,92,19,104 గా చూపించారు. అలాగే సండూర్ పవర్లో రూ.11.45 కోట్లు, సరస్వతిలో రూ.13.80 కోట్లు, హేల్విన్ టెక్నాలజీలో రూ.12.84 కోట్లు, క్లాసిక్ రియాలిటీ ప్రైవేటు లిమిటెడ్ రూ.4.55 కోట్లు, సిలికాన్‌లో రూ.2.90 లక్షలు, ఆకాశ్ రూ.10.24 కోట్లు.. మొత్తం ఆమె పేరిట రూ.53.8 కోట్ల పెట్టుబడులు ఉన్నాయి. 
 
జగన్ కుమార్తెల ఆస్తులు జగన్ పెద్దకూతురు హర్షిణీరెడ్డి పేరిట రూ.4.43 కోట్ల విలువ చేసే 187 కిలోల బంగారం, చిన్న కూతురు వర్షితరెడ్డిల పేరిట రూ.4.40 కోట్ల విలువ చేసే 3.450 కిలోల బంగారు ఉంది. జగన్ పెద్దకూతురు పేరిట కర్ణాటకలో రెండు వాణిజ్యయేతర స్థలాలు, ఇడుపులపాయలలో 4.5 ఎకరాలు, 5.50 ఎకరాలు, కే.ఎల్లమవారిపల్లెలో, పాలెంపల్లెలో రూ.1.63 కోట్ల విలువ చేసే ఆస్తులు ఉన్నాయి. ఇక చిన్న కూతురుకు అదేప్రాంతంలో అంతే సమానంగా ఆస్తులు ఉన్నాయి. పెద్ద కుమార్తెకు 25.89 కోట్లు, చిన్నకుమార్తెకు 25.57 కోట్లు విలువైన ఆస్తులు ఉన్నట్టు వెల్లడించారు. 
 
ఇకపోతే జగన్‌పై 26 కేసులు నమోదైవున్నాయి. 11 సీబీఐ కేసులు, 9 ఈడీ కేసులున్నాయి. నంద్యాల, విజయవాడ, మంగళగిరి, పొన్నూరు, సరూర్ నగర్ పోలీసు స్టేషన్లలో ఆరు కేసులు ఉన్నాయి. జగన్ అఫిడవిట్‌ను పరిశీలిస్తే.. ఎన్నికల నోటరీని రాజమండ్రిలో తయారు చేయించారు. స్టాంపులను విజయవాడలో కొనుగోలు చేశారు. 2019 ఎన్నికల సమయంలో అఫిడవిట్‌ను పులివెందులలోనే తయారు చేశారు. ఈసారి సొంతూరు పులివెందులలోకాకుండా ఇతర ప్రాంతాల్లో చేయించడం చర్చనీయాంశమైంది. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు