మంత్రి కేటీఆర్‌కు జన్మదిన శుభాకాంక్షలు తెలిపిన వైఎస్ జగన్

శుక్రవారం, 24 జులై 2020 (14:07 IST)
తెలంగాణ ఐటి మంత్రి, టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌కి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలిపారు. ప్రియమైన నా సోదరుడు తారక్‌కు పుట్టిన రోజు శుభాకాంక్షలు, ఆ దేవుడు మీకు ఆరోగ్యాన్ని అంతులేని సంతోషాన్ని ప్రసాదించాలి అంటూ జగన్ తన ట్విట్టర్ ద్వారా తెలియజేసారు.
 
ధన్యవాదాలని రీట్విట్ చేసారు కేటీఆర్. అంతేకాకుండా వైసీపీ ఎమ్మెల్యే రజిని కూడా మంత్రి కేటీఆర్‌కు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. ప్రజా సేవలో నిమగ్నమై యువతలో స్పూర్తి నింపుతున్న మీకు అన్ని సంతోషాలు దక్కాలని ఆకాంక్షించారు. ఇక సినీ నటులు, రాజకీయ ప్రముఖులు, పార్టీ నేతలు కేటీఆర్‌కు పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలిపారు.
 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు