ఆస్తుల పంపకంలో జగన్‌కు షాకిచ్చిన అప్పీలేట్ ట్రైబ్యునల్

ఠాగూర్

బుధవారం, 15 అక్టోబరు 2025 (18:19 IST)
ఆస్తుల పంపకంలో వైకాపా అధినేత, మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి జాతీయ కంపెనీ లా అప్పీలేట్ ట్రైబ్యునల్ తేరుకోలేని షాకిచ్చింది. జగన్, ఆయన భార్య భారతీ రెడ్డి, తల్లి వైఎస్ విజయమ్మ పేర్లతో ఉన్న సరస్వతి పపర్ అండ్ ఇండస్ట్రీస్  ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ షేర్ల వివాదంపై ఈ ట్రైబ్యునల్ చెన్నై బెంచ్ మధ్యంతర ఉత్తర్వులు జారీచేసింది. 
 
ఈ ఆస్తుల వ్యవహారంలో వైఎస్ విజయమ్మకు చెందిన 99.75 శాతం వాటాను యధాతథ స్థితిని కొనసాగించాలని ఆదేశించింది. అయితే, వాటాల బదలాయింపు లాంటి చర్యలకు పాల్పడరాదని ఇరు పక్షాలను ఆదేశించింది. రిజిస్టరులో సభ్యుల షేర్లను సవరించాలంటూ ఎన్సీఎల్ ఇచ్చిన ఉత్తర్వుల అమలుపై కోర్టు ధిక్కరణ చర్యలేవీ చేపట్టబోమని జగన్, భారతి రెడ్డిల తరపు న్యాయవాది ఇచ్చిన హామీని రికార్డు చేసింది.
 
ఇటీవల హైదరాబాద్ ఎన్సీఎలీ బెంచ్ జగన్‌కు అనుకూలంగా తీర్పు ఇచ్చింది. ఆ తీర్పులో కంపెనీ షేర్ల బదిలీ చట్టవిరుద్ధమని పేర్కొని, జగన్, భారతి, విజయమ్మ షేర్ హోల్డర్ హక్కులను పునరుద్ధరించాలని ఆదేశించింది. అయితే, ఈ తీర్పును సరస్వతి పవర్ అండ్ ఇండస్ట్రీస్ కంపెనీ, వైఎస్ విజయమ్మ వేరువేరుగా సవాలు చేస్తూ, చెన్నైలోని ఎన్సీఎల్పీటీని ఆశ్రయించడం జరిగింది.
 
విచారణ చేపట్టిన చెన్నై ఎన్సీఎల్పీటీ బెంచ్ "ప్రస్తుత స్థితిని కొనసాగించాలి" అని మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. 'ఇరుపక్షాలు తదుపరి విచారణ వరకు తమ షేర్ హోల్డర్ హక్కులను వినియోగించకూడదు' అని ఎన్సీఏల్టీ స్పష్టం చేసింది. ఈ ఉత్తర్వుల కారణంగా, ప్రస్తుతం జగన్‌కు భించిన షేరుహోల్డర్ హక్కులు తాత్కాలికంగా నిలిపివేయబడ్డాయి.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు