జగన్‌కు చంద్రబాబు పిచ్చి పట్టుకుంది.. అద్దంలో చూసిన ఆయన ముఖమే: షర్మిల

సెల్వి

సోమవారం, 29 జులై 2024 (16:13 IST)
అసెంబ్లీకి వైకాపా చీఫ్ జగన్మోహన్ రెడ్డి హాజరు కాకపోవడంపై ఏపీ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల ఫైర్ అయ్యారు. అసెంబ్లీకి రాకుంటే ఆయన ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయాలని షర్మిల  డిమాండ్ చేశారు. తాజాగా అసెంబ్లీకి వచ్చి ఏపీ సీఎం చంద్రబాబును నిలదీయమంటే.. ఆయనకు తానేదో కొమ్ము కాసినట్లు వుందని వ్యాఖ్యానించడం మూర్ఖత్వానికి నిదర్శనమన్నారు. 
 
ఇలా మూర్ఖంగా ప్రవర్తించే వ్యక్తిని మ్యూజియంలో పెట్టాలని.. అందుకే అద్ధంలో చూసుకోమని చెప్తున్నానని.. జగన్‌కు చంద్రబాబు పిచ్చి పట్టుకుంది. అద్దంలో ఇప్పుడు కూడా చంద్రబాబే కనపడబడుతున్నాడని వైఎస్ షర్మిల జగన్‌పై సెటైర్లు వేశారు. సోషల్ మీడియాలో తనను కించపరిచే ద్వేషం వుందని.. అది తనకు లేదని క్లారిటీ ఇచ్చారు. 
 
ఒక ప్రతిపక్షం మరో ప్రతిపక్షాన్ని ప్రశ్నించకూడదని ఎక్కడైనా ఉందా..? తప్పు చేస్తే ఏ పార్టీనైనా ప్రశ్నించే అధికారం మాకు ఉందని షర్మిల అన్నారు. జగన్ మోహన్ రెడ్డి గారు అసెంబ్లీకి వెళ్లకపోవడం తప్పని షర్మిల తెలిపారు. అసెంబ్లీకి వెళ్లకపోవడం.. చట్టసభను గౌరవించకపోవడం తప్పు కాబట్టే రాజీనామా చేయమన్నామని షర్మిల అన్నారు.  
 
వైఎస్సార్ విగ్రహాలు కూల్చేస్తే తానే స్వయంగా అక్కడికి వచ్చి ధర్నా చేస్తానని అధికార పార్టీ నాయకులు, కార్యకర్తలను హెచ్చరించిన మాట నిజమేనని తెలిపారు. అధికారంలోకి  వచ్చాక ఎన్టీఆర్ విగ్రహాలు కూల్చకుండా ఉంటే ఇప్పుడు ఈ పరిస్థితి వచ్చేది కాదని చెప్పారు. 
 
జగన్ అధికారంలో ఉన్నప్పుడు ఎన్టీఆర్ యూనివర్సిటీ పేరు మార్చకపోయి ఉంటే ఈరోజు వైఎస్సార్ కి ఇంత అవమానం జరిగి ఉండేది కాదు. అసలు వైసీపీలో వైఎస్సార్ గారిని, విజయమ్మను అవమానించినవారే కదా పెద్ద వాళ్లు అంటూ షర్మిల సెటైర్లు వేశారు. కాబట్టి "వైఎస్సార్ లాగా అసెంబ్లీలో పోరాడటం మీకు చేత కాదులే.. మీకు మీడియా పాయింటే ఎక్కువ." అంటూ జగన్‌ను ఏకిపారేశారు షర్మిల. 
 
రైతులను పక్క రాష్ట్రం రుణమాఫీతో గౌరవించిందని.. జగన్ రైతులను నిలువునా మోసం చేశారని.. ఇక వైఎస్సార్ జలయజ్ఞం పథకానికి తూట్లు పొడిచారు. మద్యపాన నిషేధం అని దగా చేశారు. మీ కంటే మోసగాళ్లు.. విశ్వసనీయత కోల్పోయిన వాళ్లు ఉంటారా..?.. అంటూ ప్రశ్నాస్త్రాలు సంధించారు. 
 
"జగన్ వ్యక్తిగత ప్రయోజనాల కోసం బీజేపీతో అక్రమ సంబంధం పెట్టుకున్నారు. రాష్ట్ర ప్రయోజనాలను, వైఎస్సార్ వ్యతిరేకించిన బీజేపీకి, తాకట్టుపెట్టారు. మీ అహంకారమే మీ పతనానికి కారణం" అంటూ వైఎస్ షర్మిల మండిపడ్డారు.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు