వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నూతన కమిటీల ఏర్పాటు?

శుక్రవారం, 27 ఆగస్టు 2021 (06:27 IST)
వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోని పదవులు,అనుబంధ సంఘాల పదవులు ఈ నెలతో ముగియనున్నాయి. వచ్చే నెల ఆఖరి వారంలో పార్టీ ప్లీనరి సమావేశం నిర్వహించాలని అధినేత వైయస్ జగన్మోహన్ రెడ్డి నిర్ణయించారు.

ప్లీనరీ అనంతరం పార్టీ పదవులతో పాటు యువజన, విద్యార్థి,మహిళ,రైతు, కార్మిక, ఉపాధ్యాయ సంఘాలకు నూతన కమిటీలు వేయనునట్లు సమాచారం.

పార్టీని బలోపేతం చేయడంలో భాగంగా రాష్ట్ర,జిల్లా(పార్లమెంట్),మండల,గ్రామ స్థాయి కమిటీలు చేయనున్నారు. కమిటీల నియామకం అనంతరం ప్రతి గ్రామంలో పార్టీ కార్యాలయం,జెండా అవిష్కరించాలని నిర్ణయించారు. గ్రామ స్థాయి నుండి అత్యధిక సంఖ్యలో సభ్యత్వ నమోదు కార్యక్రమం చేపట్టాలని తెలుస్తోంది.

వచ్చే 20 సంవత్సరాలు వైయస్ఆర్ పార్టీనే అధికారంలో ఉండేలా వ్యూహం వేస్తున్నట్లు సమాచారం.త్వతరగితిన కమిటీలు వేసి ప్రభుత్వ సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలను ప్రజలలోకి తీసుకెళ్లాలని జగన్ భావిస్తున్నారు అని తెలుస్తోంది.

కాగా వైసిపి అధికారంలోకి వచ్చిన తరువాత చాలా మంది టిడిపి,ఇతర పార్టీల నుండి వలస వచ్చి వైయస్ఆర్ పార్టీలో చేరారు.వీరికి పదవులలో పెద్ద పీట వేస్తారా.. లేక పార్టీ ఆవిర్భావం నుండి జెండా మోస్తూ,కేసులు పెట్టించుకున్న అసలైన కార్యకర్తలకు పదవులు దక్కుతాయా అని ప్రజలు ఎదురు చూస్తున్నారు.

ఏది ఏమైనా త్వరగా కమిటీలు వేసి పార్టీలో నూతనోత్సాహం నింపడానికి పార్టీ అధినేత భావించనట్లు తెలుస్తోంది.ఈ నెల ఆఖరికి అందరి పదవులు రద్దు కానున్నాయి.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు