14 యేళ్లు గుడ్డి గుర్రాలకు పళ్లు తోమారా?

ఆదివారం, 21 జులై 2019 (11:36 IST)
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని వైకాపా ప్రభుత్వంపై టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు, ఆయన తనయుడు నారా లోకేశ్, కేశినేని నానిలు చేస్తున్న విమర్శలకు విజయవాడకు చెందిన వైకాపా నేత వరప్రసాద్ పొట్లూరి ఘాటుగా కౌంటరిచ్చారు. టీడీపీ అధినేత చంద్రబాబు 14 ఏళ్ల పాటు అధికారంలో ఉన్నప్పుడు ప్రజా సమస్యలు కనిపించలేదా? అని ప్రశ్నించారు. అప్పుడు ఏం చేశారు? గుడ్డి గుర్రాలకు పళ్లు తోమారా? అంటూ నిలదీశారు.
 
ఈ మేరకు ఆయన ఓ ట్వీట్ చేశారు. "పద్నాలుగు ఏళ్లు ప్రభుత్వం నడిపారు, ఏం పీకారు అప్పుడు? గుడ్డి గుర్రాలకి పళ్ళు తోమారా? కుంభకర్ణుడి వలే ఇప్పుడు మెలుకువ వచ్చింది అయ్యా వారికి?? మళ్ళీ బజ్జో నాన్న, లెగిసేసరికి కనపడుద్ది న భూతో న భవిష్యత్ లాంటి  నవరత్నాల దీవెన. వైఎస్ జగన్ పాలన కనిపిస్తుందని వ్యాఖ్యానించారు. ఈ మేరకు ట్విట్టర్‌లో స్పందించిన పీవీపీ.. తన ట్వీట్‌కు చంద్రబాబు, నారా లోకేశ్, కేశినేని నానిలను ట్యాగ్‌ చేశారు. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు