ఏపీలో మొదలైన ఎన్నికల సందడి.. ఉద్యోగులకు తాయిలాలు.. విందు భోజనాలు

శుక్రవారం, 23 జూన్ 2023 (10:41 IST)
ఏపీలో వచ్చే యేడాది అసెంబ్లీ ఎన్నికలు జరుగనున్నాయి. దీంతో ఇప్పటి నుంచే ఎన్నికల సందడి మొదలైంది. ముఖ్యంగా, అధికార వైకాపా నేతలు ప్రభుత్వ ఉద్యోగులను ఆకట్టుకునే ప్రయత్నం చేస్తున్నారు. ప్రభుత్వంపై తీవ్ర అసంతృప్తితో ఉన్న ఉపాధ్యాయులను తమవైపు తిప్పుకొనేందుకు గురువారం పల్నాడు జిల్లా మాచర్ల ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి ఆధ్వర్యంలో ఉద్యోగుల ఆత్మీయ సమ్మేళనం నిర్వహించారు.
 
ఉద్యోగులందరికీ మంచి విందు భోజనం ఏర్పాటుచేశారు. ప్రతి ఒక్కరికీ గోడ గడియారాలు అందజేశారు. సంక్షేమ పథకాల అమలులో ఉద్యోగులే కీలకమని, రాబోయే రోజుల్లో మరింత సమర్థంగా పనిచేయాలని ఇందులో పాల్గొన్న కలెక్టరు లోతేటి శివశంకర్‌ అన్నారు. ఎమ్మెల్యే ఆధ్వర్యంలో నిర్వహించిన ఉద్యోగుల ఆత్మీయ సమావేశానికి ఆయన హాజరై మాట్లాడుతూ.. ఉద్యోగులను కలుసుకోవడం సంతోషంగా ఉందన్నారు.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు