పదకవితా పితామహుడి జన్మస్థలం తాళ్ళపాక

FileFILE
తాళ్ళపాక పేరు చెప్పగానే చాలా మందికి గుర్తుకొచ్చది అన్నమాచార్య. ఆయన వేంకటేశ్వర స్వామి భక్తుడనే విషయం అందరికి తెలిసిందే. ఇంతటి పేరు మోసిన మహానుభావుడి జన్మస్థలం తాళ్ళపాక కడప జిల్లాలోని రాజంపేట నియోజకవర్గంలో ఉంది. ఇది పర్యాటకంగా చూడాల్సిన ప్రదేశం. చారిత్రాత్మక ప్రదేశంగా దీనిని పరిగణిస్తారు.

రహదారిలో రాజంపేటకు సమీపంలో కడప - రాజంపేట ప్రధాన రహదారి నుండి తూర్పుగా 3 కి.మీ. దూరంలో తాళ్ళపాక ఉంది. ఇదోక గ్రామం. శ్రీ వేంకటేశ్వరుని 32 వేల కీర్తనలతో ఆరాధించిన పదకవితా పితామహుడు, అన్నమాచార్యుడు తాళ్లపాకలో క్రీ.శ. 1426వ సంవత్సరం జన్మించాడు.

వేంకటేశ్వర స్వామికి పరమ భక్తుడైన అన్నమయ్య పిన్నవయస్సులోనే తిరుమల చేరుకున్నాడు. పూర్తిగా వెంకన్న సేవకే అంకితమయ్యాడు. వివాహం చేసుకున్నా తిరిగి తిరుమలకు వెళ్ళాడు. అయితే ఆయన జన్మస్థలమైన తాళ్ళపాకకు ఆయన పేరు ప్రతిష్ఠలు తెచ్చి పెట్టారు. ఇక్కడ చెన్నకేశవాలయం, సుదర్శనాలయం ఉన్నాయి.

సుదర్శన ప్రతిష్ఠించిన చక్రం చక్రం కాశీలో తప్ప మరెక్కడా లేదు. ఈ ఆలయాలు 9, 10 శతాబ్దాల నాటివి. 1982లో తిరుమల తిరుపతి దేవస్థానం వారు అన్నమయ్య ఆరాధన మందిరాన్ని నిర్మించి ఆ మందిరంలో అన్నమయ్య విగ్రహాన్ని నెలకొల్పారు. ఇదిలా ఉండగా ఇటీవల టీటీడీ రాజంపేటలో కనీవినీ ఎరుగని రీతిలో అన్నమయ్య విగ్రహాన్ని నెలకొల్పారు.

దానిని భక్తి పరంగా, పర్యాటకంగా మంచి కేంద్రంగా ఏర్పాటు చేశారు. జాతీయ రహదారిపైనున్న ఈ తాళ్ళపాకకు రాజంపేట, కడప నుంచి బస్సు సౌకర్యం ఉంది.

వెబ్దునియా పై చదవండి