ఆహారంలో అతి చక్కెర వాడేవాళ్లు తగ్గించేస్తే ఏం జరుగుతుందో తెలుసా?

సిహెచ్

బుధవారం, 22 అక్టోబరు 2025 (17:56 IST)
చక్కెరను అతిగా వాడటం చాలామందికి అలవాటు. రుచికి సరిపడా వేసుకుంటే ఎలాంటి సమస్య వుండదు కానీ మోతాదుకి మించి చక్కెరను వాడితో అనారోగ్య సమస్యలు తలెత్తే అవకాశం వుంటుందంటున్నారు వైద్య నిపుణులు. అందువల్ల కాస్తంత చక్కెరను తగ్గించుకుంటే దీర్ఘకాలిక ఆరోగ్య ప్రయోజనాలుంటాయని అంటున్నారు.
 
అధిక చక్కెర రక్తపోటు, కొలెస్ట్రాల్ స్థాయిలను పెంచుతుంది. చక్కెర మానేయడం వల్ల గుండె జబ్బుల ప్రమాదం తగ్గుతుంది. ఫ్రక్టోజ్ అధికంగా ఉన్న చక్కెరను తగ్గించడం వల్ల కొవ్వు కాలేయ వ్యాధి ప్రమాదం కూడా తగ్గుతుంది. టైప్ 2 డయాబెటిస్ ప్రమాదం తగ్గుతుంది.
 
ఐతే ఆరోగ్యకరమైన చక్కెరను మానేయకూడదు. ఇక్కడ చక్కెర అంటే శుద్ధి చేసిన చక్కెర, ప్రాసెస్ చేసిన ఆహారాలు, తీపి పానీయాలలోని అదనపు చక్కెర మాత్రమే. పండ్లు, కూరగాయలు, పాల ఉత్పత్తులలో ఉండే సహజ చక్కెరలు ఆరోగ్యానికి అవసరం. ఐతే డయాబెటిస్ లేదా ఇతర ఆరోగ్య సమస్యలు ఉంటే, ఆహారంలో పెద్ద మార్పులు చేయడానికి ముందు తప్పకుండా వైద్యుడిని లేదా పోషకాహార నిపుణుడిని సంప్రదించడం మంచిది.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు