13-10-2020 మంగళవారం రాశిఫలాలు - ఆంజనేయ స్వామిని పూజిస్తే..

మంగళవారం, 13 అక్టోబరు 2020 (09:22 IST)
మేషం : ఉపాధ్యాయులకు యాజమాన్యం నుంచి ఒత్తిడి, చికాకులు అధికమవుతాయి. ట్రాన్స్‌పోర్టు, ఆటోమొబైల్ రంగాల వారికి సదావకాశాలు లభిస్తాయి. దంపతులకు ఏ విషయంలోనూ పొత్తు కుదరదు. రాజకీయ రంగాల్లో వారికి కొంత చికాకులు ఎదురవుతాయి. దైవ సేవా కార్యక్రమాలలో చురుకుగా పాల్గొంటారు. 
 
వృషభం : విదేశాలు వెళ్లడానికి చేయు ప్రయత్నాలు ఫలిస్తాయి. పండ్లు, పూలు, కొబ్బరి, చిరు వ్యాపారులకు లాభదాకయం. కుటుంబంలో ఏర్పడిన వాదనలను పట్టించుకోకపోవడం మంచిది. ఉపాధ్యాయులకు మంచి గుర్తింపు, రాణింపు లభిస్తుంది. బ్యాంకు వ్యవహారాలలో అపరిచిత వ్యక్తుల పట్ల అప్రమత్తత అవసరం. 
 
మిథునం : గత అనుభవంతో వర్తమానంలో ఒక సమస్యను అధికమిస్తారు. చిన్న చిన్న విషయాలలో ఏకీభావం కుదరదు. పెరిగిన ధరలు, చాలీచాలని ఆదాయంతో సతమతమవుతారు. దైవ కార్యక్రమాలలో చురుకుగా పాల్గొంటారు. స్త్రీలకు ఒత్తిడి, పనిభారం అధికమవుతాయి. నిరుద్యోగులకు ఊహించని అవకాశాలు వస్తాయి. 
 
కర్కాటకం : వీలైనంత వరకు మీ పనులు మీరే చూసుకోవడం ఉత్తమం. సోదరీ, సోదరుల మధ్య సంబంధ బాంధవ్యాలు బలపడతాయి. దీర్ఘకాలిక పెట్టుబడుల విషయంలో ఒక నిర్ణయానికి వస్తారు. కీర్తి ప్రతిష్టలకు కించిత్ భంగం వాటిల్లే సూచనలున్నాయి. వస్త్ర వ్యాపారులు పనివారలను ఓ కంట కనిపెట్టుకుని ఉండటం శ్రేయస్కరం. 
 
సింహం : ఉద్యోగస్తుల సమర్థతకు మంచి గుర్తింపు లభిస్తుంది. మీరు చేసే పనులకు ఆక్షేపణలు ఎదుర్కొంటారు. బ్యాంకు పనుల్లో ఏకాగ్రత అవసరం. కోర్టు వ్యవహారాల్లో ఫ్లీడర్ల ధోరణి నిరుత్సాహపరుస్తుంది. ఖర్చులు అదుపు చేయాలన్న మీ సంకల్పం నెరవేరుతుంది. కుటుంబ అవసరాలు మరింతగా పెరుగుతాయి. 
 
కన్య : రుణయత్నాలలో ఆటంకాలు తొలగిపోయి రావలసిన ధనం చేతికందుతుంది. వ్యాపారాభివృద్ధికి చేపట్టిన పథకాలు, ప్రణాళికలు ఫలిస్తాయి. రాజకీయ నాయకులు తరచూ సభలు, సమావేశాలు, వేడుకల్లో పాల్గొంటారు. అనుకున్న పనులు ఆలస్యంగా పూర్తిచేస్తారు. ఉద్యోగస్తులకు అధికారుల నుంచి గుర్తింపు రాణింపు లభిస్తుంది. 
 
తుల : ఏజెంట్లకు, బ్రోకర్ల శ్రమకు తగిన ప్రతిఫలం లభిస్తుంది. మీ మాటలు ఇతరులకు జారవేసే వ్యక్తులున్నారన్న విషయాన్ని గ్రహించండి. ప్రేమికులు అతిగా వ్యవహరించడం వల్ల భంగపాటు తప్పదు. బంధు మిత్రుల కలయిక సంతోషాన్ని, ప్రశాంతతను కలిగిస్తుంది. నిరుద్యోగులకు పోటీ పరీక్షలలో, ఇంటర్వ్యూలలో నిరాశ తప్పదు. 
 
వృశ్చికం : నిత్యావసర వస్తు స్టాకిస్టులు, రేషన్ డీలర్లకు ఊహించని పరిణామాలు ఎదుర్కొంటారు. ప్రింటింగ్ రంగాల వారికి పనిభారం అధికం. విదేశీయానం యత్నాలు ఫలిస్తాయి. ఉత్తర ప్రత్యుత్తరాలు, క్రయ విక్రయాల లావాదేవీలు సమర్థంగా నిర్వహిస్తారు. ఉద్యోగస్తులకు రావలసిన అలవెన్సులు, క్లయింలు మంజూరవుతాయి. 
 
ధనస్సు : ఆర్థిక లావాదేవీలు, కుటుంబ సమస్యలు సమర్థంగా నిర్వహిస్తారు. వస్త్ర, బంగారం, ఫ్యాన్సీ, గృహోపకరణ వ్యాపారాలు పుంజుకుంటాయి. మీరు చేసే కృషి వల్ల మీ ప్రతిభ వెలుగులోకి వచ్చి మంచి విజయం సాధిస్తారు. మంచి మాటలతో ఎదుటివారిని ప్రసన్న చేసుకోవడానికి యత్నించండి. 
 
మకరం : మీ సాయం పొందినవారే వేలెత్తి చూపుతారు. పత్రికా ప్రైవేటు సంస్థలలోని వారికి మార్పులు అనుకూలిస్తాయి. ఒక శుభకార్యం చేయాలనే ఆలోచన స్ఫురిస్తుంది. నిర్మాణ పనులలో కాంట్రాక్టర్లకు, బిల్డర్లకు ఒత్తిడి తప్పదు. నిరుద్యోగులకు సదావకాశాలు లభిస్తాయి. ఒక్కోసారి మంచి చేసినా విమర్శలను ఎదుర్కొంటారు. 
 
కుంభం : దైవ, పుణ్య, సేవా కార్యక్రమాలలో చురుకుగా పాల్గొంటారు. బంధు మిత్రుల నుంచి ఒత్తిడి, మొహమ్మాటాలు ఎదుర్కొంటారు. స్త్రీలకు సంపాదన పట్ల ఆసక్తి పెరుగుతుంది. వృత్తి ఉద్యోగాల్లో ఆశించిన మార్పులుంటాయి. రుణ యత్నాలు అనుకూలిస్తాయి. నిరుద్యోగులకు ప్రకటనల పట్ల అవగాహన అవసరం. 
 
మీనం : ఇంటా బయటా మీ మాటకు మంచి స్పందన లభిస్తుంది. ప్రింటింగ్ రంగాల వారు అక్షర దోషాలు లేకుండా తగు జాగ్రత్తలు తీసుకోవలసి ఉంటుంది. ఆదాయం పెంచుకునే దిశగా ఆలోచనలు ఉంటాయి. ఉపాధ్యాయులకు పనిభారం అధికమవుతుంది. అందివచ్చిన అవకాశం చేజారినా ఒకందుకు మంచిదేనని అనిపిస్తుంది. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు