17-04-2021 శనివారం దినఫలాలు - ఈశ్వరునికి అభిషేకం చేస్తే...

శనివారం, 17 ఏప్రియల్ 2021 (04:00 IST)
మేషం : ఆర్థిక విషయాలలో ఒక అడుగు ముందుకువేస్తారు. కొన్ని బంధాలను నిలుపుకోవడానికి కష్టపడాల్సి వస్తుంది. పోటీ పరీక్షలలో అనుకూల ఫలితాలు సాధిస్తారు. బ్యాంకు పనులు అనుకూలిస్తాయి. రాజకీయ నాయకులు కొంత సంక్షోభం ఎదుర్కొనక తప్పదు. ప్రియతముల రాక సమాచారం మీకు ఎంతో సంతృప్తినిస్తుంది. 
 
వృషభం : మీ ఆలోచనలు క్రియా రూపంలో పెట్టి జయం పొందండి. వాహనం ఇతరులకు ఇచ్చి ఇబ్బందులను ఎదుర్కొంటారు. ఉపాధ్యాయులకు మార్పులు అనుకూలం. కష్టపడి పనిచేస్తే డబ్బు దానంతట అదే వస్తుంది. బంగారు, వెండి వ్యాపారులకు లాభదాయకం ఉంటుంది. కోర్టు వ్యవహారాల్లో మెళకువ వహించండి. 
 
మిథునం : ద్విచక్రవాహనంపై దూర ప్రయాణాలు మంచివికాదని గమనించండి. వ్యాపారాభివృద్ధికి చేయు కృషిలో రాణిస్తారు. ఉద్యోగస్తులకు పనిభారం. అధిక ఒత్తిడి తప్పదు. కొన్ని ఆర్థిక సమస్యలు ఎదుర్కోవచ్చు కానీ, మరీ అంత ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. నిరుద్యోగులకు ఇంటర్వ్యూలు అనుకూలిస్తాయి. 
 
కర్కాటకం : మీ అభిప్రాయాలను సూచనప్రాయంగా తెలియజేయండి. వృత్తి ఉద్యోగాల్లో ఆశించిన మార్పులుంటాయి. చేపట్టిన పనుల్లో శ్రమాధిక్యత, ప్రయాసలెదుర్కొంటారు. కాంట్రాక్టర్లకు నూతన టెండర్ల విషయంలో లౌక్యం అవసరం. స్త్రీలకు నూతన పరిచయాలు, చుట్టుపక్కల వారి నుంచి ఆహ్వానాలు అందుతాయి. 
 
సింహం : వృత్తులవారికి ప్రజాసంబంధాలు బలపడతాయి. దుబారా ఖర్చులు అధికం. కొన్ని విషయాలు పట్టించుకోకపోవడం ఉత్తమం. వ్యాపారాల్లో నష్టాలను పూడ్చుకుంటారు. రుణం ఏ కొంతైనా తీర్చాలన్న మీ సంకల్పం నెరవేరుతుంది. అందివచ్చిన అవకాశం చేజారినా ఒకందుకు మంచిదేనని అనిపిస్తుంది. 
 
కన్య : గృహ నిర్మాణాలు, మరమ్మతులు చురుకుగా సాగుతాయి. భాగస్వామిక ఒప్పందాల్లో ఆచితూచి వ్యవహరించండి. ఒక స్థిరాస్తి అమర్చుకోవాలనే ఆలోచన స్ఫురిస్తుంది. ఎంత ధనం వెచ్చించైనా కోరుకున్న వస్తువు దక్కించుకుంటారు. మీ శ్రీమతి వైఖరి అసహనం కలిగిస్తుంది. కోర్టు వ్యవహారాలు వాయిదాపడటం మంచిది. 
 
తుల : అధికారాలు ఇంటర్వ్యూ కోసం పడిగాపులు తప్పవు. ప్రింటింగ్ రంగాల వారికి కొత్త అవకాశాలు లభిస్తాయి. విజ్ఞతతో మీ అత్మాభిమానం కాపాడుకుంటారు. వృత్తి ఉపాధి పథకాలు అంతంత మాత్రంగా సాగుతాయి. రాజీ మార్గంలో సమస్యలు పరిష్కరించుకుంటారు. సోదరీ సోదరులతో సంప్రదింపులు జరుపుతారు. 
 
వృశ్చికం : సంప్రదింపులు, ఒప్పందాలతో హడావుడిగా ఉంటారు. సంతానం ఉన్నత విద్యలపై దృష్టిసారిస్తారు. వాహనం నడుపునపుడు మెళకువ చాలా అవసరం. పెద్దమొత్తం నగదు సాయం మంచిదికాదు. వ్యాపారుల్లో కొనుగోలుదార్లతో చికాకులు, సమస్యలు ఎదుర్కొంటారు. పెద్దమొత్తం నగదు సాయం మంచిదికాదు. 
 
ధనస్సు : ఉద్యోగస్తులకు పై అధికారుల నుంచి మంచి గుర్తింపు, రాణింపు లభిస్తుంది. చిన్నారులు, ఆత్మయులకు కానుకలు చదవించుకుంటారు. ముఖ్యమైన వ్యవహారాలు మీ చేతుల మీదుగా సాగుతాయి. నిరుద్యోగులకు ఇంటర్వ్యూ సమాచారం అందుతుంది. ఉమ్మడి వెంచర్లు, ఏజెన్సీలు, లీజు పొడగింపులు, టెండర్లు అనుకూలం. 
 
మకరం : ఉపాధి పథకాల్లో నిలదొక్కుకుంటారు. ప్రైవేట్ ఫైనాన్సుల్లో మదుపు క్షేమం కాదు. అతిథి మర్యాదలు బాగుగా నిర్వహిస్తారు. గత తప్పిదాలు పునరావృత్తం కాకుండా జాగ్రత్త వహించండి. భాగస్వామిక సమావేశాల్లో మీ ప్రతిపాదనలకు ఆమోదం లభిస్తుంది. దైవ, సేవా సంస్థలకు సహాయ సహకారాలు అందిస్తారు. 
 
కుంభం : వృత్తి వ్యాపారాల్లో రాణింపు, అనుభవం గడిస్తారు. ఉన్నతస్థాయి అధికారులు కిందిస్థాయి సిబ్బందితో సంయమనంతో మెలగవలసి ఉంటుంది. ఇతరులకు బాధ్యతలు అప్పగించి ఇబ్బందులెదుర్కొంటారు. సంఘంలో పలుకుబడివున్న వ్యక్తులతో పరిచయాలు పెంచుకుంటారు. ద్విచక్రవాహనంపై దూర ప్రయాణం క్షేమంకాదు. 
 
మీనం : ఆర్థిక లావాదేవీలు, వ్యవహార ఒప్పందాల్లో మెలకువ వహించండి. వ్యాపారాల అభివృద్ధికి కొత్త పథకాలు రూపొందిస్తారు. బాకీలు, ఇతరాత్రా రావలసిన ధనాన్ని లౌక్యంగా వసూలు చేసుకోవాలి. ట్రాన్స్‌పోర్ట్, ట్రావెలింగ్, ఎక్స్‌పోర్టు రంగాల వారికి ఆశాజనకం. విలాసవస్తువుల పట్ల ఆసక్తి పెరుగుతుంది. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు