02-05-2023 మంగళవారం రాశిఫలాలు - లక్ష్మీదేవిని ఎర్రని మందారాలతో పూజించిన..

మంగళవారం, 2 మే 2023 (04:00 IST)
మేషం :- వృత్తి ఉద్యోగ బాధ్యతల్లో చిన్న చిన్న తప్పిదాలు దొర్లే ఆస్కారముంది. స్థిర బుద్ధి లేకపోవడం వల్ల ఇబ్బందులను ఎదుర్కుంటారు. దైవ కార్యక్రమాలలో పూర్తిగా నిమగ్నులవుతారు. ఉపాధ్యాయులకు, మార్కెటింగ్ రంగాల వారికి ఒత్తిడి అధికమవుతుంది. ప్రయాణాలలో పరిచయం లేని వ్యక్తులను అతిగా నమ్మవద్దు.
 
వృషభం :- ఆర్థికంగా బాగుగా స్థిరపడతారు. పట్టుదలతో శ్రమించి పనులు పూర్తి చేస్తారు. సభలు, సమావేశాలలో హుందాగా వ్యవహరించి అందరినీ ఆకట్టుకుంటారు. మీ అభిప్రాయాలను సున్నితంగా వ్యక్తం చేయండి. పెద్దల జోక్యంతో ఒక సమస్య పరిష్కారమవుతుంది. దూర ప్రయాణాలలో నూతన పరిచయాలేర్పడతాయి. 
 
మిథునం :- రియల్ ఎస్టేట్, స్పెక్యులేషన్ రంగాల వారికి సామాన్యం. వృత్తుల వారికి సదావకాశాలు లభిస్తాయి. తలపెట్టిన పనులు ఆశించినంత చురుకుగా సాగవు. బ్యాంకింగ్ వ్యవహారాలు వాయిదా పడతాయి. మీ బలహీనతలు, అలవాట్లు అదుపులో ఉంచుకోవడం మంచిది. నూతన రుణాలకోసం అన్వేషిస్తారు.
 
కర్కాటకం :- రుణబాధలు, ఒత్తిడులు, మానసిక ఆందోళన ఉంటాయి. గృహ మర్మతులు, నిర్మాణాలు చేపడతారు. గత అనుభవాలు జ్ఞప్తికి వస్తాయి. విదేశీయానం కోసం చేసే ప్రయత్నాలు అనుకూలిస్తాయి. స్త్రీలతో సంభాషించేటపుడు సంయమనం పాటించండి. ప్రింటింగ్, స్టేషనరీ రంగంలోని వారికి పని భారం పెరుగుతుంది.
 
సింహం :- ప్రముఖులను కలుసుకుంటారు. ప్రేమికులు అతిగా వ్యవహరించి చిక్కుల్లోపడే ఆస్కారం ఉంది. ఆరోగ్యం, ఆహార విషయంలో మెళకువ అవసరం. వ్యాపారాభివృద్ధికి మరింతగా శ్రమాంచాల్సి ఉంటుంది. గృహోపకరణాలకు సంబంధించి వస్తువులను కొనుగోలు చేస్తారు. స్త్రీలకు పనివారితో ఇబ్బందులు తప్పవు.
 
కన్య :- వృత్తి వ్యాపారులకు సంతృప్తి, పురోభివృద్ధి. ఉద్యోగస్తులకు సహోద్యోగులతో అప్రమత్త అవసరం. బంధువులు, సోదరుల మధ్య సత్సంబంధాలు నెలకొంటాయి. రియల్ ఎస్టేట్ రంగాలవారికి నూతన వెంచర్లు విషయంలో పునరాలోచన అవసరం. మీ ఆలోచనలు, పథకాలు క్రియారూపంలో పెట్టి జయం పొందండి.
 
తుల :- వాతావరణంలో మార్పు వల్ల ఆరోగ్యం మందగిస్తుంది. దూర ప్రయాణాలలో మెళుకువ అవసరం. స్త్రీల మనోభావాలకు, తెలివితేటలకు మంచిగుర్తింపు లభిస్తుంది. వైద్య శిబిరంలోని వారు తరచు ఒత్తిడులకు గురవుతారు. బంధువుల రాకతో గృహంలోసందడి కానవస్తుంది. ధనవ్యయం అధికంగా ఉన్నా సార్థకత ఉంటుంది.
 
వృశ్చికం :- ఆర్థిక ఒడిదుడుకులు తలెత్తిన మిత్రుల సహకారం వల్ల సమసిపోగలవు. ఎలక్ట్రానికల్, ఇన్వెర్టర్ వ్యాపారస్తులకు పురోభివృద్ధి కానవస్తుంది. ఉద్యోగస్తులు కొత్త బాధ్యతలు సమర్థవంతగా నిర్వహిస్తారు. పాత వస్తువులను కొని ఇబ్బందులను ఎదుర్కొంటారు. పొట్ట, నరాలకు సంబంధించిన చికాకులు ఎదుర్కొంటారు.
 
ధనస్సు :- హోటల్, కేటరింగ్, తినుబండారాల వ్యాపారస్తులకు లాభదాయకం. బంధు మిత్రులతో బేధాభిప్రాయాలు తలెత్తుతాయి. నిరుద్యోగులకు సదావకాశాలు లభిస్తాయి. సాంఘిక, సాంస్కృతిక కార్యక్రమాలపట్ల ఆసక్తి పెరుగుతుంది. వాదోపవాదాలకు, హామీలకు దూరంగా ఉండటం శ్రేయస్కరం. స్థిరాస్తి వ్యవహారాల్లో మెళకువ అవసరం.
 
మకరం :- బ్యాంకు వ్యవహారాలు మందకొడిగా సాగుతాయి. ప్రముఖులను కలుసుకుంటారు. బాకీలు, ఇంటి అద్దెలు, ఇతరత్రా రావలసిన బకాయిలను లౌక్యంగా వసులు చేసుకోవాలి. స్త్రీలకు నరాలకు, కళ్లు, తల, నరాలకు సంబంధించిన చికాకులను ఎదుర్కొంటారు. వాహనం కొనుగోలుకై చేయుయత్నాలు అనుకూలిస్తాయి.
 
కుంభం :- ఆర్థిక వ్యవహారాలలో ఒక అడుగు ముందుకేస్తారు. స్త్రీలకు ఇరుగు, పొరుగు వారికి నుంచి విమర్శలు తప్పవు. గృహమునకు వస్తువులు సమకూర్చుతారు. ఉద్యోగస్తులకు బరువు బాధ్యతలు అధికమవుతాయి. కోర్టు వ్యవహారాలు అనుకూలిస్తాయి. ప్రముఖులను కలుసుకుంటారు. బ్యాంకు పనులు మందకొడిగా సాగుతాయి.
 
మీనం :- ఆర్ధికంగా అభివృద్ధి కానవచ్చినా మానసిక ప్రశాంతత ఉండజాలదు. వ్యాపారాభివృద్ధికి అహర్నిశలు శ్రమిస్తారు. ఆకస్మిక ఖర్చులు, తప్పనిసరి చెల్లింపులు ఇబ్బంది కలిగిస్తాయి. ఆలయాలను సందర్శిస్తారు. కొబ్బరి, పండ్ల, పూల, కూరగాయ వ్యాపారులకు లాభదాయకం. కోర్టు వ్యవహరాలు కొత్త మలుపు తిరుగుతాయి. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు