గణేష్ నిమ్మజ్జనం సమయంలో సంకల్పం తప్పనిసరి. చాలామంది భక్తులు ఎలాంటి పూజ లేకుండా గణేశుడిని నేరుగా నిమజ్జనానికి వెళతారు. గణేశుడిని దైవిక అతిథిగా భావిస్తారు, ఆయనను అధికారికంగా బయలుదేరమని అభ్యర్థించాలి. విగ్రహం ముందు కూర్చుని ప్రార్థించి గణపయ్య నిమజ్జనానికి తీసుకెళ్తున్నామని చెప్పి నిమజ్జనానికి తీసుకెళ్లాలి. కర్పూర హారతులు ఇవ్వాలి.
సరైన పద్ధతి:
కనీసం 15-20 నిమిషాలు హారతి ఇవ్వాలి.
హారతి సమయంలో పువ్వులు, స్వీట్లు సమర్పించాలి.
గణేష్ గాయత్రి మంత్రంతో ముగించండి
విగ్రహాన్ని నిమజ్జనానికి ముందు ప్లాస్టిక్ పువ్వులు, సింథటిక్ దండలు లేదా రసాయన ఆధారిత రంగులతో అలంకరించకూడదు. తాజా పువ్వులు, దండలు, కాగితం లేదా వస్త్రంతో తయారు చేసిన బయోడిగ్రేడబుల్ అలంకరణలను ఎంచుకోవచ్చు. థర్మోకోల్, ప్లాస్టిక్ ఉపకరణాలను నివారించాలి. అలంకరణ కోసం సహజ రంగులను ఉపయోగించాలి.
ఉత్తమ రోజులు: గణేష్ చతుర్థి 1వ, 3వ, 5వ, 7వ లేదా 11వ రోజు
శుభ వేళలు: తెల్లవారుజామున (ఉదయం 6-10) లేదా సాయంత్రం (సాయంత్రం 4-7)