03-09-2023 - ఆదివారం మీ రాశి ఫలితాలు.. సూర్య స్తుతి చేస్తే..?

ఆదివారం, 3 సెప్టెంబరు 2023 (05:00 IST)
సూర్య స్తుతి ఆరాధించిన శుభం కలుగుతుంది.
 
మేషం:- స్త్రీలకు ఆర్జన, విలాస వస్తువుల పట్ల మక్కువ పెరుగుతుంది. ఉపాధ్యాయులు విశ్రాంతికై చేయు యత్నాలు ఫలిస్తాయి. దైవ సేవా కార్య క్రమాలలో చురుకుగా వ్యవహరిస్తారు. ప్రయాణాలు తాత్కాలికంగా వాయిదా వేసుకుంటే మంచిది. మీ తొందరపాటుతనం వల్ల వ్యవహారం బెడిసికొట్టే ఆస్కారం ఉంది.
 
వృషభం :- మీ మంచితనాన్ని త్వరలోనే కుటుంబ సభ్యులు గుర్తిస్తారు. పాత వస్తువులను కొనిఇబ్బందులను ఎదుర్కొంటారు. బంధువుల రాకతో గృహంలో కొత్త ఉత్సాహం, సందడి చోటు చేసుకుంటాయి. రవాణారంగాల వారికి ప్రయాణీకుతో ఇబ్బందులను ఎదుర్కొంటారు. ముఖ్యులతో మాటపట్టింపు వచ్చే ఆస్కారం ఉంది.
 
మిథునం: బంధువుల రాక వల్ల చేపట్టిన పనులపై ఆసక్తి ఉండదు. విందులలో పరిమితి పాటించండి. మీ మనసు మార్పును కోరుకుంటుంది. కుటుంబీకులతో ఏకీభవించలేకపోతారు. బాకీలు, ఇతరత్రా రావలసిన ఆదాయం అందుతుంది.స్త్రీలకు చిన్న విషయమే సమస్యగామారే ఆస్కారం ఉంది. ఉద్యోగులకు విశ్రాంతి లభిస్తుంది.
 
కర్కాటకం: భాగస్వామిక వ్యాపారాల నుంచి విడిపోయి సొంతంగా ఏదైనా చేయాలనే ఆలోచన స్ఫురిస్తుంది. సంస్థలలో పనిచేసే వారికి యజమానులకు లాభము చేకూరుతుంది. బంధువులతో సంభాషించేటపుడు మెళకువ అవసరం. ప్రత్యర్థులను సైతం ఆకట్టుకుంటారు. ప్రయాణాలలో ఆశించినంత ఉత్సాహంగా సాగవు.
 
సింహం:- ప్రముఖుల ఇంటర్వ్యూ కోసం అధిక సమయం వేచి ఉండాల్సి వస్తుంది. చేపట్టిన కార్యక్రమాలు సాఫీగా సాగుతాయి. పోటీ పరీక్షలు, ఇంటర్వ్యూలలో విజయం సాధిస్తారు. మీ సంతానం మొండివైఖరి మీకు ఎంతో చికాకు కలిగిస్తుంది. దూర ప్రయాణాలు అనుకూలిస్తాయి. వ్యాపారాల్లో ఒడిదుడుకులను అధిగమిస్తారు.
 
కన్య:- స్త్రీలు ఆడంబరాలు, విలాస వస్తువులపట్ల ఆకర్షితులవుతారు. హోటలు, తినుబండ రంగాలలో వారికి కలిసిరాగలదు. దూర ప్రయాణాలు అనుకూలిస్తాయి. దీర్ఘకలిక సమస్యలు ఎదురైనా అధికమిస్తారు.మీరు ఊహించని వ్యయం అధికమవుతుంది. వాస్తవానికి మీరు నిదానస్తు లైనప్పటికీ కొంత ఉద్రేకానికి లోనవుతారు.
 
తుల:- వృత్తి, వ్యాపారాల్లో అవరోధాలు తొలగిపోతాయి. వాగ్వివాదాలకు దిగి సమస్యలు తెచ్చుకోకండి. ప్రైవేటు సంస్థల్లో వారికి మార్పులు అనుకూలిస్తాయి. ఆధ్యాత్మిక సేవాకార్యక్రమాల్లో పాల్గొంటారు. శ్రమించిన కొలదీ ఫలితం, కార్యసాధనలో అనుకూలతలుంటాయి. మీది కాని వస్తువును ఆశించటం వల్ల భంగపాటుకు గురవుతారు.
 
వృశ్చికం:- ఏ విషయంలోను ఇతరులపై ఆధారపడక స్వయం కృషిపైనే ఆధారపడటం మంచిది. స్త్రీలకు షాపింగ్ వ్యవహారాలలో మెళుకువ అవసరం. ఓర్పు, పట్టుదలతో శ్రమించి అనుకున్నది సాధిస్తారు. విదేశాలు వెళ్ళాలనే మీ కొరిక త్వరలోనే నెరవేరబోతోంది. రిప్రజెంటేటివ్‌లకు శ్రమకు తగిన ప్రతిఫలం కానరాదు.
 
ధనస్సు:- ఆప్తుల రాకతో మానసికంగా కుదుటపడతారు. స్థిరాస్తి అమ్మకం వాయిదావేయటం మంచిది. ఎంతటి క్లిష్ట సమస్యనైనా ధైర్యంగా ఎదుర్కుంటారు. ఉపాధ్యాయులు విశ్రాంతికై చేయు యత్నాలు ఫలిస్తాయి. సమస్యలను శాంతి యుతంగా పరిష్కరించుకోవడం మంది. వాహనం ఇచ్చి విషయంలో లౌక్యంగా వ్యవహారించండి.
 
మకరం:- మీ ఆశయాలకు, అభిరుచులకు తగిన వ్యక్తులతో సంబంధాలు బలపడతాయి. స్త్రీలు అనవసర విషయాలకు దూరంగా ఉండటం క్షేమదాయకం. రియల్ ఎస్టేట్ రంగాల వారికి ఒత్తిడి తప్పదు. సతీసమేతంగా ఒక పుణ్యక్షేత్రాన్ని సందర్శిస్తారు. పండ్లు, పూలు, కొబ్బరి వ్యాపారులకు లాభదాయకంగా ఉంటుంది.
 
కుంభం:- మీరు చేయదల్చుకున్న ముఖ్యమైన పనులు అనుకున్న విధంగా సాగవు. కళత్ర మొండివైఖరి మీకు ఎంతో చికాకు కలిగిస్తుంది. రుణం కొంత మొత్తం తీర్చటంతో ఒత్తిడి నుండి కుదుటపడతారు. గృహానికి సంబంధించిన వస్తువులు కొనుగోలుచేస్తారు. మత్స్య కోళ్ళ వ్యాపారస్తులకు లాభదాయకంగా ఉంటుంది.
 
మీనం:- వ్యాపారాల్లో నిలదొక్కుకోవటానికి కొత్త కొత్త పథకాలు, ప్రణాళికలు రూపొందిస్తారు. ఒక వ్యవహారం నిమిత్తం న్యాయవాదులతో సంప్రదింపులు జరుపుతారు. మీ పట్ల జరుగుతున్న అన్యాయాన్ని సహించరు. దూర ప్రయాణాలలో ఇబ్బందులను ఎదుర్కొంటారు. స్త్రీలకు పనివారితో సమస్యలు తలెత్తుతాయి.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు