లక్ష్యసాధనకు ఓర్పు ప్రధానం. నిర్విరామంగా శ్రమిస్తారు. ఊహించని ఖర్చు తగులుతుంది. బాకీలను చాకచక్యంగా వసూలు చేసుకోవాలి. మొదలెట్టిన పనులు ఒక పట్టాన సాగవు. ఒక సమాచారం ఆలోచింపచేస్తుంది. పెద్దలతో సంప్రదింపులు జరుపుతారు.
సౌమ్యంగా మాట్లాడండి. వాదనలకు దిగవద్దు. ఖర్చులు విపరీతం. రాబడిపై దృష్టి పెడతారు. వివాహయత్నం ఫలిస్తుంది. వేదికలు అన్వేషిస్తారు. పనులు హడావుడిగా సాగుతాయి. విలాస వస్తువులు కొనుగోలు చేస్తారు. సామాజిక, దైవకార్యక్రమాల్లో పాల్గొంటారు.
లక్ష్యం నెరవేరుతుంది. ఆలోచనలు కార్యరూపం దాల్చుతాయి. ఎవరినీ తక్కువ అంచనా వేయొద్దు. ప్రతి విషయం క్షుణ్ణంగా తెలుసుకోండి. ఖర్చులు సామాన్యం. పనులు ముందుకు సాగవు. గృహ మరమ్మతులు చేపడతారు. విలువైన వస్తువులు జాగ్రత్త.
కర్కాటకం : పునర్వసు 4వ పాదం, పుష్యమి, ఆశ్లేష
సర్వత్రా అనుకూల సమయం. కీలక విషయాలపై పట్టు సాధిస్తారు. సమర్థతకు గుర్తింపు లభిస్తుంది. వ్యవహారాలు మీ సమక్షంలో సాగుతాయి. ధనలాభం, వాహనయోగం పొందుతారు. ఖర్చులు అధికం, ప్రయోజనకరం. మీ సాయంతో ఒకరికి మేలు జరుగుతుంది.
సింహం : మఖ, పుబ్బ, ఉత్తర 1వ పాదం
కార్యసిద్ధికి మరింత శ్రమించాలి. సాయం ఆశించవద్దు. మీ సమర్థతపై నమ్మకం పెంచుకోండి. స్వయంకృషితోనే అనుకున్నది సాధిస్తారు. ఖర్చులు విపరీతం. పనులు మొండిగా పూర్తి చేస్తారు. అనవసర జోక్యం తగదు. వాహనం నడిపేటపుడు జాగ్రత్త.
ఆశావహదృక్పథంతో మెలగండి. పరిస్థితులు నిదానంగా చక్కబడతాయి. త్వరలో మీ కృషి ఫలిస్తుంది. ఖర్చులు విపరీతం. పనులు అర్ధాంతంగా ముగిస్తారు. మీ శ్రీమతి వైఖరిలో మార్పు వస్తుంది. ముఖ్యులతో సంప్రదింపులు జరుపుతారు. వేడుకకు హాజరవుతారు.
అవిశ్రాంతంగా శ్రమిస్తారు. సన్నిహితుల ప్రోత్సాహం ఉంటుంది. ఖర్చులు అదుపులో ఉండవు. రుణ ఒత్తిళ్లు ఆందోళన కలిగిస్తాయి. ఆప్తుల సాయంతో ఒక సమస్య పరిష్కారమవుతుంది. పనులు పురమాయించవద్దు. సన్నిహితులతో సంభాషిస్తారు.
వృశ్చికం : విశాఖ 4వ పాదం. అనూరాధ, జ్యేష్ట 1,2,3,4 పాదములు
స్థిరాస్తి ధనం అందుతుంది. అంచనాలు ఫలిస్తాయి. రోజువారీ ఖర్చులే ఉంటాయి. నగదు డ్రా చేసేటపుడు జాగ్రత్త. పనులు సానుకూలమవుతాయి. మీ ప్రమేయంతో శుభకార్యం నిశ్చయమవుతుంది. నోటీసులు అందుకుంటారు. ప్రయాణం చికాకుపరుస్తుంది.
లావాదేవీలతో తీరిక ఉండదు. శ్రమాధిక్యత, విశ్రాంతి లోపం. ఒప్పందాల్లో జాగ్రత్త. తొందరపాటు నిర్ణయాలు తగవు. ఖర్చులు అదుపులో ఉండవు. ఆదాయ మార్గాలు అన్వేషిస్తారు. పనులు అస్తవ్యస్తంగా సాగుతాయి. ప్రముఖుల సందర్శనం సాధ్యపడదు.
పరిస్థితులు అనుకూలిస్తాయి. అనుకున్న కార్యం సాధిస్తారు. మీ పట్టుదల స్ఫూర్తిదాయకమవుతుంది. కొందరి రాక ఇబ్బంది కలిగిస్తుంది. పనులు, కార్యక్రమాలు సాగవు. పొదుపు మూలక ధనం అందుతుంది. అసాంఘిక కార్యకలాపాల జోలికి పోవద్దు.
వ్యవహారాల్లో ఏకాగ్రత వహించండి. అనాలోచిత నిర్ణయాలు తగవు. పెద్దల సలహా పాటించండి. ఖర్చులు అంచనాలను మించుతాయి. రావలసిన ధనం అందదు. అవసరాలు వాయిదా వేసుకుంటారు. పనుల్లో ఒత్తిడి, చికాకులు అధికం. ఆత్మీయులతో సంభాషిస్తారు.
మీనం : పూర్వాబాద్ర 4వ పాదం, ఉత్తరాబాద్ర, రేవతి
సంప్రదింపులు నిరుత్సాహపరుస్తాయి. తప్పటడుగు వేస్తారు. మీ తప్పిదాలను సరిదిద్దుకోండి. మీ శ్రీమతి వైఖరిలో ఆశించిన మార్పు వస్తుంది. ఇంటి విషయాలపై శ్రద్ధ వహిస్తారు. చేపట్టిన పనులు ముందుకు సాగవు. ధనం మితంగా వ్యయం చేయండి.