04-05-2023 గురువారం రాశిఫలాలు - లక్ష్మీనృసింహస్వామిని ఆరాధించిన..

గురువారం, 4 మే 2023 (04:00 IST)
మేషం :- కంప్యూటర్ రంగాల వారు పురోభివృద్ధి పొందుతారు. రాబడికిమించిన ఖర్చులు ఎదురవుతాయి. విద్యార్థులు అనుకున్న లక్ష్యాన్ని సాధిస్తారు. గతంలో ఒకరికిచ్చిన హామీ వల్ల ఇబ్బందులు తప్పవు. ప్రయాణాలు, బ్యాంకింగ్ వ్యవహరాల్లో మెళుకువ, ఏకాగ్రత వహించండి. ఉన్నతాధికారులపై దాడులు జరిగే ఆస్కారం ఉంది.
 
వృషభం :- భవిష్యత్ అవసరాలను దృష్టిలో పెట్టుకుని ధన వ్యయం విషయంలో మెళకువ వహించండి. ఉపాధ్యాయులకు యాజమాన్యం ఒత్తిడి అధికం. కలప, ఐరన్, ఇటుక, ఇసుక వ్యాపారులకు మిశ్రమ ఫలితం. ఖాది, చేనేత, నూలు వస్త్ర వ్యాపారులకు కలిసివస్తుంది. సోదరీ, సోదరుల మధ్య అవగాహన ఏర్పడుతుంది.
 
మిథునం :- కీలకమైన విషయాల్లో కుటుంబీకుల సలహా పాటించటం మంచిది. ప్రముఖుల సహకారంతో ప్రభుత్వ కార్యాలయాల్లో మీ పనులు సానుకూలమవుతాయి. కొబ్బరి, పండ్ల, పూల, పానీయ వ్యాపారాలు లాభసాటిగా ఉంటాయి. స్త్రీల ఏమరుపాటుతనం, అతి ఉత్సాహం వల్ల విలువైన వస్తువులు జారవిడుచుకుంటారు.
 
కర్కాటకం :- ట్రాన్స్‌పోర్టు, ఆటోమొబెల్ రంగాల వారికి సదావకాశాలు లభిస్తాయి. ఏసీ, కూలర్లు, ఇన్వెర్టర్ రంగాలలో వారికి లాభదాయకం శుభదాయకంగా ఉంటుంది. మీ మాటకు మంచి గుర్తింపు లభిస్తుంది. మీ కొత్త పథకాలు ఆచరణలో పెట్టి జయం పొందండి. ఉద్యోగస్తులకు పై అధికారుల నుండి ఒత్తిడి అధికమవుతుంది.
 
సింహం :- వృత్తి, వ్యాపారాలు ప్రోత్సాహకంగా సాగుతాయి. దైవ సేవా కార్యక్రమాల్లో పాల్గొంటారు. స్త్రీలు షాపింగులకు ధనం బాగా ఖర్చుచేస్తారు. శ్రీమతి సలహా పాటించటం చిన్నతనంగా భావించకండి. గృహంలో విలువైన వస్తువులు చోరీకి గురయ్యే ఆస్కారం ఉంది. ప్రేమికులకు పెద్దల నుంచి మందలింపులు, హెచ్చరికలు తప్పవు.
 
కన్య :- పాత రుణాలు తీర్చి తాకట్టు వస్తువులను విడిపిస్తారు. చిత్తశుద్ధితో మెలిగి మీ నిజాయితీని చాటుకుంటారు. పెంపుడు జంతువుల పట్ల మెళకువ వహించండి. స్త్రీలకు నరాలు, కళ్లు, దంతాలకు సంబంధించిన సమస్య లెదురవుతాయి. రుణాలు, పెట్టుబడులు సకాలంలో అందుతాయి. బంధుమిత్రులతో మనస్పర్థలు తలెత్తుతాయి.
 
తుల :- అధికారులకు ఒత్తిడి, తనిఖీలు, పర్యటనలు అధికం. ఉద్యోగస్తులు యూనియన్ కార్యకలాపాల్లో ఆచితూచి వ్యవహరించవలసి ఉంటుంది. కాంట్రాక్టర్లకు, బిల్డర్లకు నిర్మాణ పనులలో ఏకాగ్రత అవసరం. స్త్రీలకు ఆరోగ్య సంతృప్తి, శారీరక పటుత్వం నెలకొంటాయి. ఉమ్మడి వెంచర్లు, సంస్థల స్థాపనలో పునరాలోచన అవసరం.
 
వృశ్చికం :- ప్రభుత్వ సంస్థల్లో వారు జాప్యం, ఒత్తిడి ఎదుర్కొనక తప్పదు. ఉమ్మడి వ్యాపారాలు, జాయింట్ వెంచర్లు ప్రగతి పథంలో కొనసాగుతాయి. కుటుంబంలో స్పర్థలు, చికాకులు తొలగి ప్రశాంతత నెలకొంటుంది. స్టేషనరీ, ప్రింటింగ్ రంగాల వారికి పనిభారం అధికమవుతుంది. రాబడికి మంచి ఖర్చులు అధికమవుతాయి.
 
ధనస్సు :- ఆర్థిక విషయాల్లో ఒకడుగు ముందుకు వేస్తారు. స్త్రీలకు పనివారలతో ఒత్తిడి, చికాకులను ఎదుర్కొంటారు. అధికారులకు కిందిస్థాయి సిబ్బంది సాదర వీడ్కోలు పలుకుతారు. ఉద్యోగస్తులు, ప్రైవేటు సంస్థల్లో వారికి అధికారులతో అవగాహన కుదరదు. మత్స్య, పాడి పరిశ్రమల వారికి సామాన్యంగా ఉంటుంది.
 
మకరం :- ఉద్యోగస్తుల నిర్లక్ష్య ధోరణి వల్ల పై అధికారులతో మాటపడక తప్పదు. ప్రింట్, మిడియాలో ఉన్నవాళ్ళకు మెళుకువ అవసరం. రాజకీయ, పారిశ్రమిక రంగాల వారికి విదేశీపర్యటనలు అధికమవుతాయి. వైద్యులకు మంచి గుర్తింపు, రాణింపు లభిస్తుంది. ఆలయ సందర్శనాలలో ఇబ్బందులను ఎదుర్కొంటారు.
 
కుంభం :- ఆర్థిక ఒడిదుడుకులు తలెత్తిన మిత్రుల సహకారం వల్ల సమసిపోగలవు. బంధువుల రాకతో గృహంలో సందడి కానవస్తుంది. స్త్రీల మనోభావాలకు, తెలివితేటలకు మంచి గుర్తింపు లభిస్తుంది. ఉత్తరప్రత్యుత్తరాలు, బ్యాంకింగ్ వ్యవహారాల్లో మెలకువ వహించండి. విద్యార్థులకు మిత్ర బృందాల వల్ల సమస్యలు తలెత్తుతాయి.
 
మీనం :- నిరుద్యోగులకు ఇంటర్వ్యూలలో ఏకాగ్రత ఎంతో ముఖ్యం. స్త్రీలకు పనివారలతో ఒత్తిడి, చికాకులు అధికమవుతాయి. కోళ్ళ, మత్స, పాడి పరిశ్రమల వారికి సామాన్యంగా ఉంటుంది. పత్రిక, ప్రైవేటు సంస్థలలోని వారికి మార్పులు అనుకూలిస్తాయి. మీ సంతానం విద్యా విషయాల పట్ల ప్రత్యేక శ్రద్ధ వహిస్తారు. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు